వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా .. తాజాగా 40,134 కొత్త కేసులు, 422 మరణాలు, టాప్ 10 రాష్ట్రాలివే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది .గత కొద్ది రోజులుగా ప్రతిరోజు 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కరోనా ప్రభావిత రాష్ట్రాల పై దృష్టిసారించింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 40,134 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం 3,16,95,958 కి చేరింది. ఈ సంఖ్య రోజువారీ పాజిటివిటీ రేటును 2.8 శాతానికి తీసుకు వెళ్ళింది.

ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు .. ఏపీ ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు, తెలంగాణాలోనూ తస్మాత్ జాగ్రత్తముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు .. ఏపీ ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు, తెలంగాణాలోనూ తస్మాత్ జాగ్రత్త

దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు .. 4,13,718 యాక్టివ్ కేసులు

దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు .. 4,13,718 యాక్టివ్ కేసులు

ప్రస్తుతం, 4,13,718 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కరోనా ఇన్ఫెక్షన్లలో 1.3 శాతం. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, 422 మంది కరోనా మహమ్మారి తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 4,24,773 కు చేరుకుంది. గత 24 గంటల్లో 36,946 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జి లు 3, 08,57,467 కు చేరుకున్నాయి.

 రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ నుండే

రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ నుండే

మరణాల రేటు ఇప్పుడు 1.34 శాతంగా ఉండగా, దేశంలో రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది.ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులలో దాదాపు సగం కొత్త కేసులు కేరళ నుంచే నమోదవుతున్నాయి. ఇప్పుడు కేరళ దేశంలోనే నెంబర్ వన్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. గత 24 గంటల్లో కేరళలో 20,728 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 80 మంది మరణించారు. కేరళ తరువాత స్థానంలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.

 కేసుల నమోదులో తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

కేసుల నమోదులో తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 6,479 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,287 కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 1990 కేసులు, కర్ణాటక రాష్ట్రంలో 1875 కేసులు, ఒడిస్సా లో 1437 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 1990 కేసులు, కర్ణాటక రాష్ట్రంలో 1875 కేసులు, ఒడిస్సా లో 1437 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో మిజోరాంలో 861 కేసులు, మణిపూర్లో 832 కేసులు, ఇక అస్సాంలో 784 కేసులు, పశ్చిమబెంగాల్లో 701 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో కరోనా కట్టడికి ఆంక్షలను కొనసాగిస్తున్నారు.

Recommended Video

Tokyo Olympics 2021 : India Women's Hockey Team Scripts History || Oneindia Telugu
కొనసాగుతున్న పరీక్షలు, వ్యాక్సినేషన్ డ్రైవ్

కొనసాగుతున్న పరీక్షలు, వ్యాక్సినేషన్ డ్రైవ్

నిన్న ఒక్కరోజే 14,28,984 నమూనాలను వైరస్ కోసం పరీక్షించినట్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. మహమ్మారి దేశంలో సంభవించినప్పటి నుండి మొత్తం 46,96,45,494 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా, కరోనావైరస్‌కు వ్యతిరేకంగా ఇప్పటివరకు 47,22,23,639 డోసులు ఇచ్చారు, ఆదివారం 17,06,598 మంది లబ్ధిదారులు వ్యాక్సిన్ ను అందుకున్నారు.

English summary
India’s cumulative tally of coronavirus cases reached 3,16,95,958 on Monday with 40,134 new infections recorded in the last 24 hours. The numbers took the daily positivity rate to 2.8 per cent. At present, there are 4,13,718 active Covid-19 cases, which is 1.3 per cent of the total infections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X