భారత్ లో కరోనా.. రికవరీల కంటే ఎక్కువగా కొత్త కేసులు, 41,806 తాజా కేసులు, 581 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి రికవరీల కంటే ఈ రోజు కొత్త కేసులు ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 41,806 తాజా కేసులు, 581 మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో నమోదైన 581 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,11,989 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 39,130 మంది రోగులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్యను 3,0143,850 కు చేరుకుందని ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్ చూపించింది.

క్రియాశీల కేసులు 4,32,041 వద్ద ఉన్నాయి . ఇది మొత్తం కేసులలో 1.39 శాతంగా ఉన్నాయి.ఇక నిన్న నమోదైన 38,792 కరోనా కేసులతో పోల్చినప్పుడు, గురువారం కేసుల సంఖ్య బుధవారం కంటే 3,014 ఎక్కువ. మరోవైపు 624 మరణాలు నివేదించబడిన బుధవారం కంటే గురువారం మరణాల సంఖ్య 43 తక్కువ. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 43,80,11,958 మందికి నిర్వహించినట్టుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గురువారం తెలిపింది.వీటిలో గత 24 గంటల్లో 19,43,488 పరీక్షలు జరిగాయి.
ఇక కరోనా మహమ్మారి నివారించటం కోసం చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం వ్యాక్సిన్లు ఒకరితో నత్తనడకన సాగుతోంది. ఒక పక్క దేశం మొత్తం మరో వైపు థర్డ్ వేవ్ ఆందోళనతో ఉన్న సమయంలో వ్యాఖ్యల కొరత వేధిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 390 మిలియన్ మోతాదుకు పైగా వ్యాక్సిన్ అర్హతగల లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం 3.21 మిలియన్లకు పైగా మోతాదులను అందించారు. ఏది ఏమైనా కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications