వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకు దాటినట్టుగా అధికారిక గణాంకాలు చెప్పాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించగా, ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారం నుండి ఉధృతంగా ఉంది , ఇది మే నెలలో ఉగ్ర రూపం దాలుస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తగ్గు ముఖం పడుతుందని అంటున్నారు . ప్రస్తుతం దేశం మాత్రం హెల్త్ ఎమర్జెన్సీ లో ఉంది .

తెలంగాణా రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్: దేశంలోనే తొలిసారి, కేటీఆర్ ట్వీట్తెలంగాణా రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్: దేశంలోనే తొలిసారి, కేటీఆర్ ట్వీట్

దేశంలో డబుల్ మ్యూటాంట్ , త్రిబుల్ మ్యూటాంట్ కరోనా

దేశంలో డబుల్ మ్యూటాంట్ , త్రిబుల్ మ్యూటాంట్ కరోనా

ఇప్పటికే గణిత నమూనాలను ఉపయోగించి లెక్కించిన శాస్త్రవేత్తలు ఏప్రిల్ రెండో వారం తర్వాత విజృంభించే కరోనా మే నెలలో పీక్స్ కు చేరుతుందని , చివరినాటి నుండి క్షీణిస్తుందని చెప్తున్నారు.

కానీ తాజాగా దేశంలో డబుల్ మ్యూటాంట్ , త్రిబుల్ మ్యూటాంట్ విపరీతంగా దేశంలో పంజా విసురుతున్న వేళ మే చివరి నాటి నుండి అయినా కరోనా తగ్గు ముఖం పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .కానీ తప్పక క్షీణత ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. దేశంలో కరోనా మొదటిదశ కంటే, రెండోదశలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు .

 ఏప్రిల్ లో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం

ఏప్రిల్ లో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం

2020 సెప్టెంబర్ నెలలో వైరస్ తీవ్రత గరిష్టానికి చేరుకొని, 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని సూచించారు. అప్పుడు నిపుణులు అంచనా వేసినట్టే తగ్గింది . కానీ ఇప్పుడు పరిస్థితి , రోజువారీ కేసులు పెరుగుతున్న తీరు శాస్త్రవేత్తల అంచనాలకు అందటం లేదు. కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య అంచనా వేయడానికి సూత్ర మోడల్ మూడు ప్రధాన పారా మీటర్స్ గా రెండో దశ కరోనా ఉదృతిని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఇప్పటికే మూడు లక్షలు దాటి పీక్స్ కు చేరినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఏప్రిల్ నెలలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది .

మే నెలలో కరోనా ఉగ్ర రూపం .. మే చివరి నుండి క్షీణత

మే నెలలో కరోనా ఉగ్ర రూపం .. మే చివరి నుండి క్షీణత

ఇక మే నెలలో కరోనా మరింత ఉగ్ర రూపం దాల్చి మే చివరి నాటి నుండి క్షీణిస్తుంది అని అంచనా వేస్తున్నారు . కరోనా మహమ్మారి రెండవ దశలో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రభావితం అయ్యింది . ఇక దేశంలో అనేక రాష్ట్రాలు దారుణ స్థితిలో ఉన్నాయి. ఇక ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రజలు భయాందోళన మధ్య ఉన్నారు. మహమ్మారి ఎక్కడ తమకు సోకుతుందో అని భయపడుతున్నారు .

గాలి నుండి కూడా వ్యాపిస్తున్న మహమ్మారి .. అలెర్ట్

గాలి నుండి కూడా వ్యాపిస్తున్న మహమ్మారి .. అలెర్ట్

ఇంత ప్రమాదకర స్థితిలో ఇండియా ఉన్నప్పటికీ దేశ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. ఎక్కడికక్కడ కర్ఫ్యూలు , 144 సెక్షన్ లు , వారాంతపు లాక్ డౌన్ విధిస్తూ కరోనా కట్టడి యత్నాలు చేస్తున్నారు . గాలి నుండి కూడా కరోనా వ్యాపిస్తుంది అని చెప్తున్న నేపధ్యంలో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అంటున్నారు . ఏది ఏమైనా కరోనా మహమ్మారి విసిరిన పంజా దెబ్బకు భారత్ కుదేలవుతుంది. వచ్చే మే నెలలో కూడా కరోనా ఉధృతి కొనసాగనుంది . అందుకే అలెర్ట్ అంటున్నారు నిపుణులు , అధికారులు .

English summary
With corona second wave , a record number of positive cases have been reported .Official figures show that the number of daily cases has crossed 3 lakh. scientists predicting a sharp rise in May.The country is currently in a health emergency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X