వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా టెన్షన్; 14,241కు పెరిగిన యాక్టివ్ కేసులు; తాజా పరిస్థితి ఇదే!!

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన కొనసాగుతోంది. మూడు రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తీరు దేశంలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది అన్న ఆందోళనకు కారణంగా మారుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 2,451 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదవడంతో, భారతదేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,30,52,425కి పెరిగింది.

దేశంలో 14,241కి పెరిగిన క్రియాశీల కేసులు

దేశంలో 14,241కి పెరిగిన క్రియాశీల కేసులు


అయితే క్రియాశీల కేసులు 14,241కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. 54 తాజా మరణాలతో దేశంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,22,116 కు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులలో 24 గంటల వ్యవధిలో 808 కేసుల పెరుగుదల నమోదైంది.

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ


గురువారం నాడు 4.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2451 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న కరోనా మహమ్మారి బారినుండి 1589 మంది కోలుకున్నారు. ఇక క్రియాశీల కేసులు 14,241 కేసులకు పెరిగాయి. ఇక దేశంలోకేసుల పెరుగుదలకు ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో మృతిచెందిన 54 మందిలో కేరళ ప్రకటించిన మృతుల సంఖ్య 48 గా ఉంది.

ఢిల్లీలో కరోనా కేసుల పంజా

ఢిల్లీలో కరోనా కేసుల పంజా

దేశ రాజధాని ఢిల్లీ లో నిన్న 965 కేసులు నమోదు కాగా, కేరళ, హర్యానా రాష్ట్రాలలో 300 మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఒకరోజు 18 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకో గా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 187 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని అధికారిక డేటా చెబుతోంది. పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందుతున్న ఢిల్లీలో అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాలలో 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన లబ్ధిదారులందరికీ బూస్టర్ కోవిడ్ -19 డోస్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇక అందరూ మాస్కులు ధరించటం తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తుంది.

English summary
The manner in which over two thousand corona cases have been reported in India for three days . There have been 2,451 new cases and 54 deaths in India in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X