వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పోలీసులకు కరోనా టెర్రర్ .. ఒకే పోలీస్ స్టేషన్ లో 26 మందికి కరోనా

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా కంట్రోల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కరోనా బాధితులు పెరిగిపోయారు. ఇక మహారాష్ట్రలో తాజాగా నమోదైన కేసులు చూస్తే 16,758 కేసులు నమోదు కాగా 13,013 మందికి యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు డిశ్చార్జ్ అయి ఇళ్ళకు వెళ్ళిన వారు 3,094 మంది కాగా 651మంది మృతి చెందారు . ముఖ్యంగా ముంబై లో 10,714 కేసులు నమోదు అయ్యాయి అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక ఇదే సమయంలో ముంబైలో కరోనా కంట్రోల్ కోసం 144 సెక్షన్ విధించారు . అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం పోలీసులకు కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తుంది .

కరోనా కంట్రోల్ కు మహా సర్కార్ సంచలన నిర్ణయం ... అక్కడ లిక్కర్ షాపులు బంద్ కరోనా కంట్రోల్ కు మహా సర్కార్ సంచలన నిర్ణయం ... అక్కడ లిక్కర్ షాపులు బంద్

ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న 26 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 12 మంది అధికారులతో సహా ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో కనీసం 26 మంది సిబ్బందికి కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చెయ్యగా కరోనా పాజిటివ్ గా తేలినట్టు అధికారులు చెప్తున్నారు. ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావటం ఇప్పుడు మహా పోలీసుల్లో టెన్షన్ కు కారణం అవుతుంది. అయితే వారిలో 12 మంది ఉన్నతాధికారులు ఉ‍న్నట్టు అధికారులు వెల్లడించారు.

Corona terror to the cops .. positive to 26 cops in a police station

ఇక ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కు చెందిన 26 మందిని ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నిర్దారణ అయిన అధికారులతో కాంటాక్ట్ లో ఉన్న మిగతా పోలీసుల వివరాలు సేకరించి వారిని కూడా క్వారంటైన్ చేస్తున్నామని చెప్తున్నారు . ఇప్పటి వరకు ముంబైలో దాదాపు 250 మంది పోలీసులకి కరోనా సోకిందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఒక ప్రకటనలో చెప్పారు. ఇక కరోనాతో ఇప్పటికే ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి.

English summary
The 26 policemen of Mumbai's JJ Marg police station have been diagnosed as corona-positive, causing tension in the police. However, authorities have revealed that 12 of them are higher officials .they sent to quarantine and giving medication .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X