వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా అప్డేట్ .. భారత్ లో 33వేలు దాటిన కరోనా కేసులు.. టాప్ 10 లో ఉన్న రాష్ట్రాలివే !!

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతుంది . తన ప్రతాపాన్ని చూపిస్తుంది . కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు కఠినం గా వ్యవహరించినా , లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినా సరే కరోనా మాత్రం కల్లోలం సృష్టిస్తుంది . దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Recommended Video

Coronavirus Update : India COVID-19 Cases Crossed 33,000 Mark

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖ

 దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33,184

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33,184

తాజా, కరోనాపై అధికారిక బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33 వేలు దాటింది.. గత 24 గంటల్లో 1,718 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,184 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోలుకున్న వారు 8,455 మంది కాగా 24 గంటల్లో 629 మంది క్యూర్ అయినట్టు సమాచారం . గత 24 గంటల్లో 67 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో క్యూర్ శాతం 25.1గా ఉండగా, మరణాల శాతం 3.2గా నమోదైంది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సంభవించిన మరణాలు చూస్తే 1,081 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 23,648 యాక్టివ్‌ కేసులున్నాయి.

టాప్ 1 లో మహారాష్ట్ర .. వరుసగా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే

టాప్ 1 లో మహారాష్ట్ర .. వరుసగా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే

ఇక అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలను చూస్తే మహారాష్ట్ర టాప్ 1 గా నిలిచింది. లోనే కరోనా కేసులు సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. మహారాష్ట్రలో 9,915 కేసులు నమోదు అయ్యాయి. ఇక, మృతిచెందినవారి సంఖ్య 432కు చేరింది. తరువాత స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్‌లో 4,082 కేసులు నమోదు కాగా 197 మంది మృతి చెందారు

ఇక ఢిల్లీలో 3,439 కేసులు నమోదు అయ్యాయి. 56 మంది మృతి చెందారు. నాల్గవ స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచింది . 2,561 కేసులు నమోదు కాగా 129 మరణాలు సంభవించాయి .
ఇక ఐదవ స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో 2,438 కేసులు నమోదు అయ్యాయి. 51 మరణాలు సంభవించాయి.

 కరోనా కేసుల్లో లాస్ట్ లో మిజోరాం , అరుణాచలప్రదేశ్ లు

కరోనా కేసుల్లో లాస్ట్ లో మిజోరాం , అరుణాచలప్రదేశ్ లు

తమిళనాడులో 2,162 కేసులు నమోదు కాగా , 27 మంది మృతి చెందినట్టు అధికారిక వివరాల ద్వారా తెలుస్తుంది. కర్ణాటకలో 535 కేసులు నమోదు అయ్యాయి. 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు 1,332 కరోనా కేసులు రాగా , 31 మరణాలు సంభవించాయి .తెలంగాణలో 1,016 కేసులు నమోదు అయ్యాయి. కరోనా మృతుల సంఖ్య 25 కు చేరింది . ఇక 10 వ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ లో 758కేసులు నమోదు కాగా 22 మంది మృతి చెందారు . ఇక కరోనా కేసుల నమోదులో లాస్ట్ లో ఉన్న రాష్ట్రాలు మిజోరాం , అరుణాచలప్రదేశ్ లు.. ఇక్కడ కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు అయ్యింది .

English summary
Corona virus claw throws in India. Shows its impact . Corona creates turmoil, even if governments are strict on controlling corona cand restricting people to homes by lock down. The number of corona positive cases in the country, as well as the number of deaths due to corona , is growing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X