వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona update : ప్రపంచంలో 7వ స్థానంలో ఇండియా .. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా

|
Google Oneindia TeluguNews

ఇండియా లో కరోనా పంజా విసురుతుంది . ఇప్పుడు భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ఏడవ స్థానానికి చేరుకుంది .ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్ వరల్డ్ మీటర్ ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఇండియాలో తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 5,408 మరణాలతో సహా 1,90,622 కేసులతో భారతదేశం ఇప్పుడు ఏడవ స్థానంలో ఉంది.

corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!corona update : ప్రపంచంలో 9వ స్థానానికి భారత్ .. ఇండియాలో తాజా పరిస్థితి ఇది !!

కరోనా కేసుల్లో 7 వ స్థానంలో భారత్

కరోనా కేసుల్లో 7 వ స్థానంలో భారత్

ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 5,934,936 గా ఉన్నాయి, వీటిలో 367,166 మరణాలు సంభవించాయని WHO తెలిపింది. భారతదేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్ ౭ వ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ 18,18,983 కేసులతో అగ్రస్థానంలో ఉంది. అమెరికా మరణాల సంఖ్య 101,567 అయితే దాని మరణాలు మే 10 న 5,475 గరిష్ట స్థాయి నుండి ఆదివారం మే 31 వరకు 1,263 కు పడిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

రోజు రోజుకూ ఒక్కో స్థానంముందుకు వెళ్తున్న భారత్

రోజు రోజుకూ ఒక్కో స్థానంముందుకు వెళ్తున్న భారత్

5,01,985 కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉండగా, 4,05,843 కేసులతో రష్యా మూడవ స్థానంలో ఉంది. యుకె, స్పెయిన్ మరియు ఇటలీ భారతదేశం కంటే ఘోరంగా ఉన్న మరో మూడు దేశాలు కాగా వీటి తర్వాత ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశంగా ఇండియా ఉంది . ఆదివారం నాడు భారతదేశం ఇప్పటివరకు అత్యధికంగా భారత్ లో 8,380 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అంటే తాజా పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

టాప్ 10 జాబితాలో ఇప్పుడు భారత్ స్థానం 7

టాప్ 10 జాబితాలో ఇప్పుడు భారత్ స్థానం 7

భారతదేశ మరణాల రేటు కూడా గత నెల మేలో చూస్తే రెండు రోజులలో పెరిగింది. మే 5 న ఇది 195 మరణాలను నమోదు చేసింది, ఇది మే 30 న 265 మంది మరణించినట్లు తెలుస్తుంది .మే 25 న కరోనా కేసుల సంఖ్య 138,000 దాటినప్పుడు భారత్ 10 వ ప్రభావిత దేశంగా మారింది. 135,000 కేసులున్న ఇరాన్‌ను భారత్ అధిగమించి టాప్ 10 జాబితాలో చేరింది. ఇక ఇప్పుడు 7 వ కోవిడ్ ప్రభావిత దేశంగా భారత్ మారింది. ఇక భారతదేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది, అయితే ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

Recommended Video

COVID-19 Cases Crossed 3045 Mark In AP, 98 New Cases Registered In 24Hrs
డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా .. పెరుగుతున్న కేసులతో భారత్ లో టెన్షన్

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా .. పెరుగుతున్న కేసులతో భారత్ లో టెన్షన్

కరోన కేసుల్లో ఒక్కో స్థానం ఎగబాకుతూ భారత దేశంలో ముందుకు వెళ్ళటం ఆందోళనకర పరిస్థితి కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 1,90,622 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 93,348గా ఉంది. ఇప్పటి వరకు 91,855 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 5,408కి పెరిగింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపధ్యంలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇక ఈ క్రమంలో కరోనా కొత్త కేసులు ప్రభుత్వాలను టెన్షన్ పెడుతున్నాయి.ఇక లాక్ డౌన్ 5.0 నేటి నుండి కొనసాగనుంది. అయినా కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతుంది.

English summary
India is now the seventh worst hit country by the Covid-19 pandemic with a tally of 1,82,143 cases including 5,164 casualties, according to the World health Organisation world meter . On Sunday, the total number of Covid-19 cases across the world stood at 5,934,936 including 367,166 deaths, the WHO said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X