వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోరాను కంట్రోల్ చేస్తున్న దేశంలో నెంబర్ రాష్ట్రం, సూపర్, కేంద్రం, ఆంధ్రా, తెలంగాణ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) ఆ దేశాల ప్రభుత్వాలకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేసినా కరోనా వైరస్ మాత్రం కట్టడి కావడం లేదు. గత 24 గంటల్లో భారత్ లో 10, 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 10 వేల మందికిపైగా కరోనా వైరస్ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. దేశంలో కరోనా వైరస్ వ్యాధి నుంచి 2, 04, 710 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించడంతో కర్ణాటక నెంబర్ స్థానంలో ఉందని, ఆ రాష్ట్రాన్ని చూసి మిగిలిన రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా తెలిపింది. కర్ణాటకను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రలు అనేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

కేంద్ర ప్రభుత్వం నిఘా

కేంద్ర ప్రభుత్వం నిఘా

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. దేశంలో ఏఏ రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి ?, అక్కడ వైరస్ వ్యాపించడానికి కారణం ఏమిటి ?, అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ? అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. అంతే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసింది.

మహారాష్ట్ర పేరు చెబితే దడ ?

మహారాష్ట్ర పేరు చెబితే దడ ?


దేశంలో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నెంబర్ వన్ గా నిలిచింది. మహారాష్ట్రలో ఒక్కరోజులో 3, 827 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రజలు హడలిపోయారు. కరోనా వైరస్ వ్యాధితో 24 గంటల్లో మహారాష్ట్రలో 142 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ కాటుకు 5, 893 మంది బలి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1, 24, 331 మంది కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కర్ణాటక సూపర్

కర్ణాటక సూపర్


కరోనా వైరస్ అంటురోగాన్ని అరికట్టడంలో కర్ణాటక శక్తి వంచనలేకుండా పని చేస్తోందని స్వయంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ చెప్పింది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా, COVID- 19 మొబైల్ అఫ్లికేషన్ ద్వారా కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రయత్నాలు చేసిందని, కర్ణాటకలో ఇప్పటి వరకు 1 కోటి 50 లక్షల ఇండ్లకు స్వయంగా వెళ్లిన వైద్య సిబ్బంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారని, కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో అని ప్రజలకు వివరించడంలో కర్ణాటక ప్రభుత్వం విజయం సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

కర్ణాటకను చూసి నేర్చుకుందాం !

కర్ణాటకను చూసి నేర్చుకుందాం !


కరోనా వైరస్ వ్యాధిని నియంత్రించడంలో కర్ణాటక అనుసరిస్తున్న విధానాలను చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇతర రాష్ట్రాలకు మనవి చేసింది. కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తే కచ్చితంగా కరోనా వైరస్ ను నియంత్రించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కర్ణాటక పాటిస్తున్న నియమాలను అందరూ పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇతర రాష్ట్రాలకు సలహా ఇచ్చింది.

కర్ణాటకలో ఎంత మందికి కరోనా ?

కర్ణాటకలో ఎంత మందికి కరోనా ?

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో ఒక కోటి 40 లక్షల మందికిపైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఊహించని దానికంటే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదైనాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 8, 281 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. కర్ణాటకలో 24 గంటల్లో 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు

ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు

శుక్రవారం కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై 10 మంది మరణించారు. కర్ణాటకలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో 124 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. మొత్తం మీద కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడంలో కర్ణాటక నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక పొరుగు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కర్ణాటక ప్రభుత్వం పనితీరును మెచ్చుకుంటున్నారు.

English summary
Coronavirus: Follow Karnataka Model To Control COVID 19 death rate and spread rate. Centre Told To Other States in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X