వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కొనసాగుతున్న కరోనా : గత 24 గంటల్లో 38,079 కొత్త కేసులు, 560 మరణాలు !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 38,079 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశపు కరోనావైరస్ కేసుల సంఖ్య 3,10,64,908 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 560 మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4,13,091గా నమోదయ్యింది.

గత 24 గంటల్లో 43,916 కొత్త రికవరీలు నమోదు కాగా దీంతో మొత్తం రికవరీలు 3,02,27,792 కు చేరుకుంది. నిన్న ఒకరోజు క్రియాశీల కేసుల సంఖ్య 6,397 తగ్గింది. మొత్తం క్రియాశీల కేసులు 4,24,025 గా నమోదైంది . ఇది మొత్తం కోవిడ్ -19 కేసులలో 1.39 శాతంగా నమోదయింది. శనివారం గణాంకాలు శుక్రవారం 38,949 తాజా కేసుల కంటే 870 తక్కువ. ఇంతలో, 542 మరణాలు సంభవించిన మునుపటి రోజు కంటే మరణాల సంఖ్య 18 ఎక్కువ.

coronavirus in India: 38,079 new cases, 560 deaths in last 24 hours !!

దేశంలో ఇప్పటివరకు కోవిడ్ -19 కోసం మొత్తం 44,20,21,954 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. గత 24 గంటల్లో 19,98,715 నమూనాలు పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అనేక రోజువారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో ప్రజల్లో కరోనా భయం పోయిందని, మాస్కుల వాడకం తగ్గుతుందని, మరలా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మే నెలలో మాస్కుల వాడకం భారతదేశంలో గరిష్ట స్థాయికి చేరుకుందని చూపించిన గ్రాఫ్‌ను లవ్ అగర్వాల్ ప్రస్తావించారు. అయితే ఈ ధోరణి జూన్ మరియు జూలైలలో స్థిరంగా క్షీణించింది. ఆగస్టు మరియు సెప్టెంబరులలో మాస్క్ వాడకం మరింత తగ్గుతుందని గ్రాఫ్ అంచనా వేసింది. ఇది మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

English summary
India’s cumulative tally of coronavirus rose to 31,064,908 on Saturday after 38,079 new cases were recorded in the last 24 hours, according to the Union ministry of health and family welfare . As many as 560 fatalities and 43,916 new recoveries were reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X