వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ 3.0 : ఏయే జోన్లలో దేనికి అనుమతి.. దేనిపై నిషేధం.. వివరాలివే..

|
Google Oneindia TeluguNews

రెండో దశ లాక్ డౌన్ ముగింపుకు మరో 2 రెండు రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0ని ప్రకటించింది.మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఈ పీరియడ్‌లో ఏయే జోన్లలో ఎలాంటి యాక్టివిటీస్‌కు సడలింపు ఉంటుందో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే జోన్లతో సంబంధం లేకుండా అన్నిచోట్ల కొన్నింటిపై నిషేధాన్ని కొనసాగించింది. విమానాలు,రైళ్లు,మెట్రో,అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రయాణాలపై నిషేధం విధించింది. అలాగే స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లు సహా అన్నిరకాల విద్యా సంస్థలు యథావిధిగా మూసివేసే ఉంటాయి.

Recommended Video

Lockdown 3.0: Zones Wide What Will Open And What Will Remain Shut From May 04 | Oneindia Telugu
ఆరెంజ్ జోన్లకు కేంద్రం మార్గదర్శకాలు..

ఆరెంజ్ జోన్లకు కేంద్రం మార్గదర్శకాలు..

ఆరెంజ్ జోన్లలో కొన్ని యాక్టివిటీస్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. టాక్సీలు,క్యాబ్స్ ఆరెంజ్ జోన్లలో తిరగవచ్చు. అయితే డ్రైవర్‌ మినహా కారులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అలాగే ఆరెంజ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో అంతర్ జిల్లా ప్రయాణాలకు అనుమతినిచ్చింది. అయితే అది కూడా కొన్ని పనులకు మాత్రమే. ఫోర్ వీలర్స్‌కు అనుమతినిచ్చిన కేంద్రం... డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే అనుమతినిచ్చింది. టూ వీలర్స్‌పై ఇద్దరు ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది.

రెడ్ జోన్లలో వేటికి అనుమతి.. వేటిపై నిషేధం..

రెడ్ జోన్లలో వేటికి అనుమతి.. వేటిపై నిషేధం..

రెడ్ జోన్లలో కంటైన్‌మెంట్ పరిధికి బయట ఉన్న ప్రాంతాల్లో కొన్ని యాక్టివిటీస్‌కు అనుమతినిచ్చారు. అత్యవసర పనులు,లేదా ప్రభుత్వం మినహాయింపునిచ్చిన వాటి కోసం మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఫోర్ వీలర్‌లో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణించడానికి,టూ వీలర్ అయితే కేవలం ఒకరు మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,ఇటుక బట్టీలు,భవన నిర్మాణం వంటి వాటికే ఈ అనుమతులు ఉంటాయి. రెడ్ జోన్లలో ఇంతకుముందు లాగే ఆటోలు,క్యాబ్స్,పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అన్నీ బంద్ ఉంటాయి. అలాగే సెలూన్స్,స్పా కూడా మూసివేసే ఉంటాయి.

గ్రీన్ జోన్ల సంగతేంటి..

గ్రీన్ జోన్ల సంగతేంటి..


గ్రీన్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతినిచ్చారు. గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతినిచ్చారు. అయితే కేవలం 50శాతం కెపాసిటితోనే బస్సులను నడిపించాలి. అలాగే ప్రతీ డిపో నుంచి కేవలం 50శాతం బస్సులనే బయటకు తీయాలి. ఎగుమతి ఆధారితి యూనిట్లు,సెజ్,ఇండస్ట్రియల్ ఎస్టేట్స్,ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ అన్ని తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. అయితే ఇంటర్ స్టేట్,ఇంట్రా స్టేట్ ప్రయాణాలపై నిషేధం ఉంటుంది.

English summary
The Ministry of Home Affairs (MHA) on Friday extended the nationwide lockdown to prevent the spread of the novel coronavirus by another two weeks or 14 days. This is in addition to the extended lockdown due to end on May 4 as announced by Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X