బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: CET exams, ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులకు షరతులు, క్వారంటైన్, క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ అమరావతి/ తిరుపతి: కర్ణాటకలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలోనే 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అందరితో శహభాష్ అనిపించుకున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు సీఇటీ (CET) పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్దం చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారు ప్రస్తుతం కర్ణాటకలో క్వారంటైన్ నియమాలు పాటించాలి. ఇలాంటి సమయంలో సీఇటీ పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది.

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

బెంగళూరులో సీఇటీ పరీక్షలు

బెంగళూరులో సీఇటీ పరీక్షలు

కర్ణాటకలో సీఇటీ పరీక్షలు ( Karnataka Common Entrance Test) రాయడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉన్న విషయం తెలిసిందే. సీఇటీ పరీక్షలు రాయడానికి కర్ణాటకలోని విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు.

కరోనా టైమ్ లో అవసరమా ?

కరోనా టైమ్ లో అవసరమా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. కర్ణాటకలో సైతం కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సీఇటీ పరీక్షలు రాయడానికి కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చే అవకాశం ఉందని, అందు వలన సీఇటీ పరీక్షలు వాయిదా వెయ్యాలని అనేక మంది విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

నో కాంప్రమైజ్

నో కాంప్రమైజ్

సీఇటీ పరీక్షలు వాయిదా వెయ్యాలని అనేక మంది డిమాండ్ చేసినా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల (జులై) 30, 31వ తేదీల్లో సీఇటీ పరీక్షలు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసే బాధ్యత మాదే అని కర్ణాటక ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.

ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు

ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు


కరోనా వైరస్ దెబ్బతో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే కచ్చితంగా ప్రభుత్వ నియమాల ప్రకారం క్వారంటైన్ లో ఉండాలి. అయితే సీఇటీ పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులకు క్వారంటైన్ నియమాలు వర్తించవని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహ ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కర్ణాటకలో సీఇటీ పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని షరుతులు పెట్టింది.

కచ్చితంగా పాటించాలి, లేదంటే ?

కచ్చితంగా పాటించాలి, లేదంటే ?

సీఇటీ పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా మాస్క్ లు పెట్టుకోవాలని, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక గదులు కేటాయించామని, ఒక్కోక్క గదిలో కేవలం 24 మంది మాత్రమే పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తున్నామని ఆరోగ్య శాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. మాస్క్ లేదంటే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Recommended Video

#Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral
 గుంపులుగా ఉంటే కుదరదు

గుంపులుగా ఉంటే కుదరదు


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కుటుంబ సభ్యులు పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల గుంపులు గుంపులుగా ఉండకూదని ప్రభుత్వం సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సీఇటీ పరీక్షలు రాసే విద్యార్థుల గదుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రభుత్వం అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం ఇచ్చే మాస్క్ లు కచ్చితంగా వేసుకోవాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Coronavirus: No quarantine for out of state students who come to attend CET exam in Karnataka. Exam scheduled on July 30 and 31, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X