coronavirus: కరోనా మరణ మృదంగం, ఆరుకి చేరిన మృతుల సంఖ్య, పాట్నాలో మృతి..

కరోనా వైరస్ రక్కసి దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం 290 మధ్య ఉన్న కేసులు.. ఆదివారం నాటికి 324కి చేరాయి. వైరస్ బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. పాట్నాలో శనివారం మృతిచెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో దేశంలో వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఆరుకి చేరింది.

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటు చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. దీంతో దేశంలో వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది.

coronavirus: sixth corona dead in pune aiims

Recommended Video

    Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

    కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న పాట్నాలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+