Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

నాగ్పూర్/ బజాజ్ ( మహారాష్ట్ర): కరోనా క్వారంటైన్ కేంద్రాలు కొన్ని చోట్ల ప్రేమికులకు స్వర్గంలాగా తయారైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వ్యక్తితో టచ్ లో ఉన్న లేడీ పోలీసుకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెను క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే తన భర్తతో కలిసి తాను క్వారంటైన్ లో ఉంటానని లేడీ పోలీసు అధికారులకు చెప్పింది. భర్తే కదా ? అని గుడ్డిగా నమ్మిని పోలీసు అధికారులు లేడీ పోలీసు, ఆమె భర్తగా నటించిన ప్రియుడిని కలిపి పోలీసు ట్రైనింగ్ (శిక్షణ) కేంద్రంలోని క్వారంటైన్ లో పెట్టారు. ప్రియురాలు లేడీ పోలీసుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న టైంలో ప్రియుడి భార్య ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 లేడీ పోలీసు లవ్ స్టోరీ

లేడీ పోలీసు లవ్ స్టోరీ

మహారాష్ట్రలోని కాన్పూర్ లో ఓ లేడీ పోలీసు ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నది. గత ఏడాది అక్టోబర్ లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పోస్టాఫీసు (తపాలా కార్యాలయం)లో ఉద్యోగం చేసే యువకుడితో లేడీ పోలీసుకు పరిచయం అయ్యింది. తనకు పెళ్లి కాలేదని ఆ యువకుడు లేడీ పోలీసుకు మాయమాటలు చెప్పాడు. తరువాత లేడీ పోలీసు, పోస్టాఫీసులో ఉద్యోగం చేసే యువకుడు ప్రేమలో పడి అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నారు.

అమ్మా తల్లి నువ్వు క్వారంటైన్ లో ఉండాలి

అమ్మా తల్లి నువ్వు క్వారంటైన్ లో ఉండాలి

కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తితో టచ్ లో ఉన్న లేడీ కానిస్టేబుల్ కు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. లేడీ పోలీసుకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు ఆమెను క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. లేడీ పోలీసును క్వారంటైన్ కు పంపించాలని, లేదంటే సమస్యలు ఎదురౌతాయని వైద్యులు పోలీసు అధికారులకు సూచించారు. మహారాష్ట్రలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, విపరీతంగా పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో పోలీసులు సరే అన్నారు.

నా భర్తతో అయితే క్వారంటైన్ లో ఓకే

నా భర్తతో అయితే క్వారంటైన్ లో ఓకే

తాను క్వారంటైన్ కు కచ్చితంగా వెలుతానని, అయితే తనకు తోడుగా తన భర్తను కూడా క్వారంటైన్ కు పంపించాలని లేడీ కానిస్టేబుల్ పోలీసు అధికారులకు మనవి చేసింది. లేడీ పోలీసు భర్తకు కరోనా వైరస్ ఏమైనా సోకిందేమో ? అనే అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ లో పెట్టడానికి పోలీసు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పోలీసు క్వాటర్స్ లో ఎంజాయ్

పోలీసు క్వాటర్స్ లో ఎంజాయ్

కాన్పూర్ లోని పోలీసు శిక్షణా కేంద్రంలోని క్వాటర్స్ లోని క్వారంటైన్ లో లేడీ పోలీసు, ఆమె భర్తగా నటిస్తున్న ప్రియుడిని క్వారంటైన్ చేశారు. ప్రియుడితో కలిసి వారం రోజులుగా లేడీ పోలీసు ఎంజాయ్ చేస్తోంది. అయితే లేడీ పోలీసు ప్రియుడి భార్యకు ఓ సమాచారం అందింది. నీ భర్త క్వారంటైన్ లో ఉన్నాడని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఓ వ్యక్తి భార్యకు సమాచారం ఇచ్చాడు.

వాడు నామొగుడు... కిలాడీ పోలీసు మొగుడు కాదు

వాడు నామొగుడు... కిలాడీ పోలీసు మొగుడు కాదు

భార్య వెతుక్కుంటూ నేరుగా పోలీసు శిక్షణా కేంద్రం దగ్గరకు వెళ్లింది. గేట్ దగ్గర విధుల్లో ఉన్న పోలీసులు భార్యను అడ్డుకుని ప్రశ్నించారు. తన భర్త క్వారంటైన్ లో ఉన్నాడని, ఓసారి చూడాలని భార్య చెప్పింది. నీ భర్త ఎవ్వరు ? ఇక్కడ ఎందుకు ఉన్నాడు ? అంటూ పోలీసు అధికారులు భార్యను ఆరా తీశారు. లేడీ పోలీసుతో కలిసి క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి ఆమె భర్త కాదని గేటు దగ్గర ఉన్న మహిళ భర్త అని తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

Recommended Video

    Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
    ఎంత పని చేశావ్ తల్లి

    ఎంత పని చేశావ్ తల్లి

    క్వారంటన్ లో ఉన్న వ్యక్తి కోసం ఓ మహిళ పోలీసు శిక్షణా కేంద్రం దగ్గరకు వచ్చి గొడవ చేస్తోందని తెలుసుకున్న కాన్పూర్ సిటీ పోలీసు కమిషనర్ భూషణ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేశారు. గేటు దగ్గర ఉన్న మహిళ భర్త లేడీ పోలీసుతో నాటకం ఆడాడని తెలుసుకున్న పోలీసు కమిషనర్ భూషణ్ కుమార్ లేడీ పోలీసు మీద, ఆమె ప్రియుడి మీద కేసు నమోదు చెయ్యాలని బజాజ్ పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు. ప్రియుడిని భర్త అని నమ్మించి పోలీసు అధికారులను మోసం చేసిన లేడీ పోలీసును సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద క్వారంటైన్ కేంద్రాన్ని బెడ్ రూంగా చేసుకుని ఎంజాయ్ చేసిన లేడీ పోలీసు, ఆమె ప్రియుడు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+