కర్ణాటకలో మొదలైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ; మొదలైన సందడి!!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలివిడతలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. ఈసారి 2615 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.అదనపు బలగాలను కూడా అందుబాటులో ఉంచారు.

రాష్ట్రవ్యాప్తంగా నేడు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి ఈవీఎంలను తీసుకువెళ్లి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు ఎన్నికల సిబ్బంది. బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర, శాంతి నగర, చిక్ పేటె, ధార్వాడ లోని స్ట్రాంగ్ రూమ్స్ , బెంగళూరులో మౌంట్ కార్మెల్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లను సైతం ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.

Karnataka Assembly Election Results 2023

ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ లపై నిషేధం విధించారు. ఒకపక్క కౌంటింగ్ ప్రారంభం కాగా మరోపక్క అందరూ అభ్యర్థుల్లో టెన్షన్ కొనసాగుతోంది. పైకి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న లోలోపల ఆందోళనకు గురవుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి తాము వస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీ లభించడం ఖాయమని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.

141 స్థానాలు ఖచ్చితంగా వస్తాయని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ విశ్వాసంతో ఉన్నారు. మరొక బీజేపీ కూడా ఎటువంటి హంగ్ లేకుండా కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో అధికారం తమ ఖాతాలో పడుతుందని భావిస్తుంది. అందుకు కావాల్సిన యత్నాల్లో ఉంది.

Karnataka Assembly Election Results 2023

ఇక కర్ణాటకలోని జేడీఎస్ తమ పార్టీ చాలా చిన్న పార్టీ అని ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని తనకు అంత డిమాండ్ కూడా లేదని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కర్ణాటక రాష్ట్రంలో కౌంటింగ్ మొదలు కావడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+