మత విశ్వాసాల ప్రకారం విడిపోవడం దేశానికి మంచిదికాదు: కార్డినల్
న్యూఢిల్లీ: దేశం మతాల వారీగా విభజించబడడడం ప్రజాస్వామ్యానికి మంచింది కాదని క్యాథలిక్ క్రిస్ట్రియన్ల అత్యున్నత సంఘం (సిబిసిఐ)అధ్యక్షుడు కార్డినల్ అభిప్రాయపడ్డారు.. సెక్యులర్ దేశంగా ఇండియా ఉండాలనేది తన అభిమతమన్నారు.కానీ, దేశం మతాల వారీగా విడిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురౌతాయన్నారు. దీనికి వ్యతిరేకంగా తాను పోరాటం చేయనున్నట్టు చెప్పారు.
కార్డినల్ ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.మత గురువులు, పూజారులపై దాడులను ఆయన ప్రస్తావించారు. సాత్నాలో చోటు చేసుకొన్న దాడులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అయితే నిందితులను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఈ దాడులకు పాల్పడిన కుట్రదారులను వదిలేసి అమాయకులను పేదలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలతో ప్రభుత్వంపై తమకు విశ్వాసం సన్నగిల్లిందని కార్డినల్ అభిప్రాయపడ్డారు.అయితే అతి పెద్ద దేశంలో ఈ తరహ ఘటనలు జరుగుతాయనే దాన్ని తాము అర్ధం చేసుకొంటామని చెప్పారు. కానీ, ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం బాధితులకు ఏ రకమైన రక్షణ కల్పిస్తోందనే విషయం కూడ ఆధారపడుతోందని ఆయన గుర్తు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా సమీపంలో సుమారు 30 మంది మత గురువులు, మత ప్రచార సభలను అడ్డుకొన్నారు. నిర్భందించారని ఆయన చెప్పారు.త పోలీసులతో పాటు భజరంగ్‌దళ్ కార్యకర్తలు బలవంతంగా మతమార్పిడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మత మార్పిడుల కింద బలవంతంగా ఓ మత గురువును అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని తమ ప్రతినిధి బృందంతో కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.బాధితులకు రక్షణ కల్పించాలని కార్డినల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడుల వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications