మళ్లీ కరోనా ముప్పు- 1 దాటిన ఇండియా ఆర్ వ్యాల్యూ-మూడు నెలల్లో తొలిసారి
భారత్ లో కోవిడ్ 19 ప్రభావం మరోసారి కనిపిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో తగ్గినట్టే తగ్గి మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆర్ వ్యాల్యూ కూడా 1 దాటిపోయింది.
ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం, చుట్టు పక్కన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రతీ రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీలో ఆంక్షలప్రభావం మొదలైంది. మాస్కులు తప్పనిసరి చేసిన ఆప్ సర్కార్.. వాటిని ధరించకపోతే రూ.500 ఫైన్ విధిస్తోంది. దీంతో పాటు ఢిల్లీ పాఠశాలలు తెరించి ఉందాలా వద్దా అనే అంశంలో ఢిల్లీప్రభుత్వం ఇరుకునపడుతోంది. ప్రస్తుతానికి మాత్రం మాస్కులు ధరించి రావాలని విద్యార్ధులను కోరుతోంది. విద్యాసంస్ధల మూసివేత విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.

1 కంటే ఎక్కువగా ఉండే R విలువ యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగినట్లు సూచిస్తుంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి R వ్యాల్యూ 1 కిందకు ఉండాలి. 1 కంటే తక్కువ ఆర్ వ్యాల్యూ సంఖ్య వ్యాధి వ్యాప్తిని కొనసాగించడానికి తగినంత మంది వైరస్ సోకిన వ్యక్తులు లేనందున వ్యాధి వ్యాప్తి తగ్గుతున్నట్లు సూచిస్తుంది.కోవిడ్ కోసం భారతదేశం యొక్క ప్రభావవంతమైన పునరుత్పత్తి సంఖ్య (R సంక్రమణ ఎంత త్వరగా వ్యాపిస్తుందో సూచించే సూచికగా భావిస్తారు.
ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఈ ఆర్ వ్యాల్యూ తొలిసారి ఒకటికి పైగా పెరిగిందని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుడు అంచనా వేశారు. సితాబ్ర సిన్హా ప్రకారం, ఏప్రిల్ 12-18 మధ్య వారానికి గత కొన్ని వారాలుగా క్రమంగా పెరుగుతున్న దేశ R విలువ 1.07గా ఉంది. అంతకు ముందు ఏప్రిల్ 5-11 వారంలో ఇది 0.93గా ఉంది.












Click it and Unblock the Notifications