Bed scam: పరుపుల బ్లాక్ దందాలో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరుడు అందర్, నేత్రా ఆంటీతో స్కెచ్ !
బెంగళూరు/హైదరాబాద్: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పడం ఎవ్వరికి సాధ్యం కావడం లేదు. కోవిడ్ రోగుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న అత్యవసర బెడ్ లు బ్లాక్ లో విక్రయిస్తున్న దందా తెర మీదకు వచ్చింది. బెడ్ స్కామ్ కేసులో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ముఖ్యఅనుచరుడిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇదే బెడ్ స్కామ్ గురించి సాటి ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరుడు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. తాను ఎమ్మెల్యే పీఏ అంటూ బయట చెప్పుకుని తరుగుతున్న బాబు అరెస్టు కావడంతో ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని విచారణ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది. నేత్రావతి ఆంటీతో కలిసి ఓ బెడ్ ఇవ్వాలంటే బాధితుల నుంచి రూ. 50 వేలు లంచం తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

బెడ్ స్కామ్ కలకలం
బెంగళూరులో కోవిడ్ రోగుల కోసం కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 % బెడ్ లు ప్రభుత్వం (BBMP) రిజర్వు చేసింది. కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ లు బ్లాక్ లో విక్రయిస్తున్నారని, అలాంటి వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బీజేపీ ఎమ్మెల్యేలు సతీష్ రెడ్డి, రవిసుబ్రమణ్య తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదే ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అరెస్టు
బెంగళూరు కోవిడ్ బెడ్ స్కామ్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) బెంగళూరులోని బోమ్మనహళ్ళి బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్న రూపేన అగ్రహార నివాసి బాబు (34) అనే వ్యక్తిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఎమ్మెల్యే సతీష్ రెడ్డితో పాటు తిరుగుతున్న బాబు బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఇప్పుడు దూమరం రేపింది.

ఆంటీ కింగ్ పిన్
కరోనా బెడ్ లు బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న నేత్రావతి, రోహిత్ కుమార్ లను స్వయంగా బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా పట్టుకుని బెంగళూరులోని జయనగర పోలీసులకు అప్పగించారు. నేత్రావతి, రోహిత్ కుమార్ అకౌంట్ లో ఉన్న సుమారు రూ. 1. 05 లక్షలను అధికారులు గుర్తించారు. నేత్రావతి టీమ్ లోని కొందరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఇటీవల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మీడియాకు చెప్పారు.

కిలాడీ నేత్రావతి స్కెచ్
బెంగళూరులోని బేగూరులో నివాసం ఉంటున్న నేత్రావతి అలియాస్ నేత్రా అలియాస్ అక్క (42) స్వచ్చంద సంస్థ కార్యకర్త అంటూ తిరుగుతోంది. నేత్రావతి పక్కింటిలోనే నివాసం ఉంటున్న రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ (32) అనే యువకుడితో పాటు కొందరు నేత్రావతితో జతకలిశారు. బీబీఎంపీ ఆధీనంలో ఉండే ఆసుపత్రుల్లోని బెడ్ లు, ఐసీయూ బెడ్ లు వారికి కావలసిన వారి పేర్లతో బ్లాక్ చేసి తరువాత కోవిడ్ రోగుల బంధువులు ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేలకు పైగా వసూలు చేసి వారికి బెడ్ లు కేటాయిస్తున్నారని వెలుగు చూసింది. కోవిడ్ రోగుల కోసం సహాయం చేస్తున్నామని నేత్రావతి ఇప్పటికే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ దందా మొదలుపెట్టిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

వెనుక నుంచి బాబు స్కెచ్ ?
నేత్రావతి, రోహిత్ కుమార్ తదితరులకు బీబీఎంపీ వార్ రూమ్ వివరాలు చెబుతున్న బాబు బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్ లు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. బెడ్ లు ఖాళీగా ఉన్న విషయం బాబు చెప్పిన తరువాత నేత్రావతి, రోహిత్ వాటిని కోవిడ్ బాధితులకు ఒక్కొ బెడ్ రూ. 50 వేలుకు బ్లాక్ లో విక్రయించారని, జయనగరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇద్దరి నుంచి రూ. 1 లక్ష తీసుకుని రెండు బెడ్ లు కేటాయించారని తమ దగ్గర సమాచారం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. ఆ డబ్బును తరువాత బాబు, నేత్రావతి, రోహిత్ తదిరులు పంచుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేకి షాక్ !
బీబీఎంపీ పరిధిలో బ్లాక్ లో కోవిడ్ రోగులకు బెడ్ లు విక్రయిస్తున్నారని, ఈ స్కామ్ లోని నిందితులను అరెస్టు చెయ్యాలని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యేలు సతీష్ రెడ్డి, రవిసుబ్రమణ్య ఆరోపించారు. అయితే ఇదే కేసులో ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా చెప్పుకుని తరుగుతున్న బాబు అరెస్టు కావడం కలకలం రేపింది.

ఎమ్మెల్యే విచారణ ?
బెంగళూరు బోమ్మనహళ్ళి బీజేపీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి పేరు చెప్పుకుని బాబు బీబీఎంపీ వార్ రూమ్ లో తిరుగుతూ అక్కడి ఉద్యోగులను పరిచయం చేసుకుని ఖాళీగా బెడ్ లు ఎక్కడెక్కడ ఉన్నాయని అని తెలుసుకున్నాడని, తరువాత నేత్రావతి, రూపేష్ తో కలిసి ఈ దందా చేశాడని పోలీసులు అంటున్నారు. బాబు అరెస్టు కావడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పుడు ఎమ్మెల్యే సతీష్ రెడ్డిని విచారణ చేసి వివరాలు సేకరించాలని సిద్దం అవుతున్నారని తెలియడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications