అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Black fungus: కరోనాను జయించాడు వెంటాడిన బ్లాక్ ఫంగస్, ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/అనంతపురం: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి పుణ్యమా అంటూ ఎప్పుడు ఏ రోగాలు వచ్చి మా ప్రాణాలు పోతాయో అంటూ ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ కు తోడుగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ కొత్త జబ్బులు పుట్టుకు రావడంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. కరోనాను జయించిన ఆనందంలో ఉన్న ఓ వ్యక్తి తనకు బ్లాక్ ఫంగస్ వచ్చిందని అనుమానంతో హడలిపోయాడు. ఎక్కడ తన కారణంగా కుటుంబం మొత్తం ప్రాణం మీదకు తెచ్చుకుంటారో అనే భయంతో కుటుంబం పెద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Online affair: పగలు ప్రియుడు, రాత్రి మొగుడు, లవర్ చేతిలో సీక్రెట్ వీడియోలు, ఫ్యామిలీ ప్యాక్ !Online affair: పగలు ప్రియుడు, రాత్రి మొగుడు, లవర్ చేతిలో సీక్రెట్ వీడియోలు, ఫ్యామిలీ ప్యాక్ !

కరోనా పాజిటివ్

కరోనా పాజిటివ్


బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపురం పట్టణం (ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దు) లోని విద్యానగర్ లో రవీంద్ర (54) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రవీంద్ర సొంతంగా మగ్గాలు పెట్టుకుని పట్టు చీరలు నేస్తూ చేనేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. అనారోగ్యానికి గురైన రవీంద్రను కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు. రవీంద్రకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

 కరోనాను జయించాడని ఆనందం

కరోనాను జయించాడని ఆనందం


గత వారంలో రవీంద్రను చిక్కబళ్లాపురం జిల్లాలోని బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. అప్పటి నుంచి కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రవీంద్ర కోలుకున్నాడు. కరోనా వైరస్ తో పోరాటం చేసిన తాను ప్రాణాలు నిలుపుకున్నానని రవీంద్ర ఆనందంలో మునిగిపోయాడు. రవీంద్రను కోవిడ్ కేర్ సెంటర్ నుంచి ఇంటికి పిలుచుకుని వెళ్లారు.

బ్లాక్ ఫంగస్ వచ్చిందని ?

బ్లాక్ ఫంగస్ వచ్చిందని ?

ఇంటికి వెళ్లిన రవీంద్ర మళ్లీ అనారోగ్యానికి గురైనాడు. బ్లాక్ ఫంగస్ వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి రవీంద్రను తరలించారు. తనకు సక్రమంగా చికిత్స చెయ్యడం లేదని, బ్లాక్ ఫంగస్ తో తాను చనిపోతానని, మీరు నాకు వైద్యం చెయ్యకుండా ఏం చేస్తున్నారు అంటూ రవీంద్ర విక్టోరియా ఆసుపత్రి వైద్యులు అక్కడి సిబ్బందితో గొడవపడ్డాడు.

Recommended Video

#Krishnapatnam Medicine ఆయుర్వేదానికి పెరిగిన డిమాండ్.. పుత్తూరు కట్టు, చేప మందు సక్సెస్
 ఫ్యామిలీకి సోకుతుందని అనుమానంతో !

ఫ్యామిలీకి సోకుతుందని అనుమానంతో !


బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రవీంద్ర తాను బ్లాక్ ఫంగస్ తో ఉంటే తన కుటుంబ సభ్యులకు ఆ వ్యాది అంటుందనే అనుమానంతో కుమిలిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేశాడు. అందరూ నిద్రపోయిన తరువాత రవీంద్ర మగ్గాలు పెట్టిన రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విషయం గుర్తించిన రవీంద్ర కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ భయంతోనే రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు.

English summary
COVID-19: Black fungus patient committed suicide at Doddaballapura near Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X