దేశీ విమానాలపై డీజీసీఏ ప్రకటన.. నవంబర్ 24 దాకా సర్వీసులు రద్దు..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటికీ కంట్రోల్ లోకి రాకపోవడంతో దేశీ విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 వరకు అన్ని రకాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, అదే సమయంలో దేశీయ విమాన ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ ఆగస్టు 24 వరకు కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం ప్రకటన చేసింది.
Recommended Video
కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో.. మార్చి నుంచి రద్దయిపోయిన దేశీ విమాన సర్వీసులను.. మే 25 నుంచి పునరిద్ధరిస్తామని విమానయాన శాఖ ప్రకటించినా, అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు మరోసారి సర్వీసుల రద్దు గడువును పొడిగించింది. విమాన చార్జీలపై గతంలో ఇచ్చిన ఆదేశాలు ఆగస్టు 24 వరకు కొనసాగుతాయని తెలిపింది.

40 నిమిషాల కన్నా తక్కువ వ్యవధి కలిగిన ప్రయాణాలకు రూ .2,000 నుంచి రూ.6,000 వసూలు చేయాలని, గంటలోపు ప్రయాణాలకు రూ .2,500 నుంచి రూ.7,500, గంటన్నర లోపునకు రూ .3,000 నుంచి రూ .9,000వేలు, రెండు గంటలలోపు రూ .3,500, నుంచి రూ.10,000వేలు, 150 నుంచి180 నిమిషాల ప్రయాణానికి రూ.5,500 నుంచి రూ .15,700 వేలు.. అలా నియంత్రించిన ధరలు మరో నెలపాటు అమలులో ఉంటాయని డీజీసీఏ ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 49,310 కేసులు బయటపడగా, ఒక్కరోజులోనే 720 మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రానికి కేసుల మొత్తం సంఖ్య 13.35 లక్షలకు, మరణాల సంఖ్య 31,400కు పెరిగింది. మొత్తం కేసుల్లో 8.49లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4.54లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications