వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

COVID-19: కరోనా కాలింగ్ బెల్ ఎప్పడు వేస్తుందో ? ఏమో ? ఐటీ హబ్ లో కొత్తగా ?, పర్వాలేదు కానీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ ఎవరి ఇంటి కాలింగ్ బెల్ ఎప్పుడు వేస్తుందో ఏమో ? చెప్పడం ఎవ్వరికి సాధ్యం కావడం లేదు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక ప్రజలకు కంటి మీద కనుకులేకుండా బతుకుతున్నారు. ఎప్పుడు ఏరూపంలో కరోనా వైరస్ వచ్చి కాలింగ్ బెల్ వేస్తుందో అర్థం కాకపోవడంతో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. కర్ణాటకలో నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పర్వాలేదు ? అనిపించినా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఐటీ హబ్ బెంగళూరులో లాక్ డౌన్ దెబ్బతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్డడంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నా మేము ఇంకా ప్రశాంతంగా మాత్రం లేమని స్థానికులు అంటున్నారు.

Exchange: ఐసీయూలో తండ్రి, ఆక్సిజన్ కావాలంటే నా బెడ్ రూమ్ లోకి రా, ఆఫర్ ఇచ్చిన శ్రీమంతుడు !Exchange: ఐసీయూలో తండ్రి, ఆక్సిజన్ కావాలంటే నా బెడ్ రూమ్ లోకి రా, ఆఫర్ ఇచ్చిన శ్రీమంతుడు !

 జస్ట్ 31, 531 కొత్త కేసులు

జస్ట్ 31, 531 కొత్త కేసులు

కర్ణాటకలో కొత్తగా 31, 531 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ( మే 16వ తేదీ సాయంత్రం వరకు) నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గత 24 గంటల్లో 403 మంది ప్రాణాలు పోయాయని అధికారులు అన్నారు. కర్ణాటకలో 22, 03, 462 మంది కోవిడ్ బారినపడ్డారని, ఇప్పటి వరకు 21, 837 మంది ప్రాణాలు పోయాయని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

 బెంగళూరులో సరేసరి

బెంగళూరులో సరేసరి

కర్ణాటకలో గత 24 గంటల్లో 36, 475 మంది కోవిడ్ వ్యాధిని జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా నమోదు అయిన 31, 531 కరోనా పాజిటివ్ కేసులో బెంగళూరులో 8, 344 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గతంతో పోల్చుకుంటే బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని అధికారులు అంటున్నారు.

 కోవిడ్ తో పోరాటం చేశారు

కోవిడ్ తో పోరాటం చేశారు

కర్ణాటకలో ఇప్పటి వరకు కోవిడ్ వ్యాధితో పోరాటం చేసిన 15, 81, 457 మంది వ్యాధి నయం చేసుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మరణించిన 403 మందిలో బెంగళూరుతో పాటు బళ్లారి, ఉత్తర కన్నడ జిల్లా, హాసన్ బెంగళూరు గ్రామీణ, మండ్య, శివమొగ్గ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు తెలిపారు. సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని, ప్రజలు ఇంకా సహకరించాలని అధికారులు మనవి చేస్తున్నారు.

 కరోనా కాలింగ్ బెల్ ఎప్పుడు వేస్తుందో ? ఏమో

కరోనా కాలింగ్ బెల్ ఎప్పుడు వేస్తుందో ? ఏమో

కరోనా వైరస్ ఎవరి ఇంటి కాలింగ్ బెల్ ఎప్పుడు వేస్తుందో ఏమో ? చెప్పడం ఎవ్వరికి సాధ్యం కావడం లేదు. కర్ణాటకలో నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పర్వాలేదు ? అనిపించినా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఐటీ హబ్ బెంగళూరులో లాక్ డౌన్ దెబ్బతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్డడంతో ప్రజలు కొంచెం ఊపిరిపీల్చుకున్నా మేము ఇంకా ప్రశాంతంగా మాత్రం లేమని స్థానికులు అంటున్నారు.

English summary
COVID-19: Karnataka has reported 31,531 new cases of COVID-19 and 403 fatalities, taking the total number of infections to 22,03,462 and deaths to 21,837 so far, the Health Department said in Bengaluru on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X