వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో మళ్లీ కరోనా విలయం -కొత్తగా 26,291 కేసులు, 118 మంది బలి -2021లో ఇదే హయ్యెస్ట్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలో మళ్లీ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ, మళ్లీ భయపడే స్థాయికి చేరాయి. డిసెంబర్, జనవరిలో తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించిన కేసులు.. తిరిగి మూడు నెలల గరిష్టానికి చేరాయి..

మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్మోదీకి భారీ షాక్ -ఈ పాపం మనకొద్దు -ఇందిరకే మృత్యువు తప్పలేదు -రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2021లో ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులివే. ఆదివారం నాటి లెక్కలతో పోల్చుకుంటే, ఒక్కరోజులోనే కొత్త కేసులు 3.8శాతం పెరగడం గమనార్హం. తాజా వాటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది.

Covid-19: With 26,291 new cases, India records biggest spike in nearly 3 months

కొత్త కేసులతోపాటు దేశంలో కరోనా మరణాలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 1,58,725కు పెరిగింది. ఆదివారం నమోదైన (161) మరణాలు గడిచిన రెండు వారాల్లో అత్యధిక సంఖ్యగా నిలిచింది. ఆదివారం ఒక్కనాడే 7.03లక్షల శాంపిళ్లను పరీక్షించగా, ఇప్పటిదాకా 22.74కోట్ల టెస్టులు చేపట్టామని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా,

నిన్న ఒక్కరోజే కొత్తగా 17,455 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 96.68శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం నాటికి యాక్టివ్ కేసులు మళ్లీ 2లక్షల మార్కును దాటి, 2,19,262కు చేరాయి.

చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివేచంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే

దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర నుంచే వస్తుండటం గమనార్హం. అక్కడ ఆదివారం ఒక్కరోజే ఏకంగా 16వేల కొత్త కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాగ్‌పూర్‌ సహా కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. ఇక దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 2,99,08,038మంది కొవిడ్ టీకాలను వేయించుకున్నారు.

English summary
India on Monday saw another huge jump in its Covid-19 tally with 26,291 more people testing positive for the virus, according to the Union health ministry. This is the biggest jump in daily new cases in nearly three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X