వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిన్‌కు 4 డిజిటల్ సెక్యూరిటీ కోడ్: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏం చేయాలంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం చేపడుతున్నాయి. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడమే ఉత్తమ మార్గం కావడంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా నిర్వహిస్తున్నాయి.

కోవిన్‌లో రిజిస్ట్రేషన్ అవగాహన లేకపోవడంతో..

కోవిన్‌లో రిజిస్ట్రేషన్ అవగాహన లేకపోవడంతో..

కాగా, టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, దీనిపై అవగాహన లేని చాలా మంది రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ.. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లడం లేదు. స్లాట్ సమయం ముగిసిన తర్వాత ఆయా వ్యక్తులు వ్యాక్సిన్ వేయించుకోకపోయినా వ్యాక్సినేషన్ కంప్లీటెడ్ అని సంబంధిత మొబైల్‌కు సందేశం వస్తోంది. దీంతో చాలా మందికి ఇదో సమస్యగా మారింది.

తాజాగా, కోవిన్ సెక్యూరిటీ కోడ్ తీసుకొచ్చిన కేంద్రం..

తాజాగా, కోవిన్ సెక్యూరిటీ కోడ్ తీసుకొచ్చిన కేంద్రం..

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్ పోర్టల్‌లో సరికొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై కోవిన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని, వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు నాలుగు డిజిట్ల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సినేషన్ సమయంలో అక్కడి సిబ్బందికి అది చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాక్సిన్ ఇస్తారు. లేదంటే వ్యాక్సిన్ ఇచ్చినట్లు నమోదు కాదు. అంతేగాక, సెక్యూరిటీ పరమైన లోపాలను, వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని అధిగమించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Recommended Video

Covid Vaccination : 'Shot And A Beer' వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్రీగా బీరు || Oneindia Telugu
కోవిన్ పోర్టల్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా?

కోవిన్ పోర్టల్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా?

కోవిన్ వెబ్‌సైట్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో వ్యాక్సినేషన్ సెక్షన్‌కు వెళ్లాలి.

ఇక్కడ, మీ వివరాలను, తదుపరి ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

ఇది ఇప్పటికే పూర్తి చేసినట్లయితే నేరుగా సైన్ ఇన్ అవ్వండి.

సైన్ ఇన్ చేసిన తర్వాత, మీ నివాస రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి

మీకు సమీపంలో ఉన్న టీకా కేంద్రం, దాని ఖచ్చితమైన పిన్ కోడ్ గురించి మీకు తెలిస్తే, మీరు పిన్ కోడ్ ద్వారా శోధించడం ద్వారా ప్రక్రియను తగ్గించవచ్చు.

ఇక్కడ, మీకు సమీపంలో ఉన్న అన్ని టీకా కేంద్రాలు, వాటిలో లభించే స్లాట్లు మీకు చూపబడతాయి

ప్రాధాన్యత ఉన్న ఏదైనా ఆకుపచ్చ స్లాట్‌పై క్లిక్ చేసి, టైమ్ స్లాట్, కేంద్రాన్ని ఎంచుకోండి, మీ బుకింగ్‌ను నిర్ధారించండి.

ధృవీకరించబడిన తర్వాత, మీకు నాలుగు అంకెల భద్రతా కోడ్ ఇవ్వబడుతుంది, ఎస్ఎంఎస్ మీ ఇన్‌బాక్స్‌కు పంపబడుతుంది

మరుసటి రోజు, టీకా కేంద్రంలో, మీ బుకింగ్‌ను ధృవీకరించడానికి ఈ భద్రతా కోడ్‌ను ఉపయోగించుకోవచ్చు.

టీకాలు వేసిన తర్వాత, మీ ఫోన్ నంబర్‌తో మళ్ళీ కోవిన్‌కు లాగిన్ అవ్వండి, మీ టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

English summary
The Union health ministry has announced the addition of a new security feature in the CoWIN portal, that will aim to reduce erroneously generated vaccination certificates and prevent impersonators and fraudulent actors looking to misguide users for financial gains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X