సహోద్యోగి భార్యపై కన్ను: మేనేజర్‌ను హత్య చేశాడు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ బహుళజాతి కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి భార్యపై కన్నేసిన అదే కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి, ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఆ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సౌరభ్ రస్తోగి అనే వ్యక్తి ఓ ఎంఎన్‌సి కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య అంకీషా కూడా అదే కంపెనీలో పని చేస్తోంది. సౌరభ్ కంపెనీలోనే నిందితుడు రిశ్విన్ చెంగప్ప(25) సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. ఈ ముగ్గురూ ఒకే కంపెనీలో కావడంతో వీరికి పరిచయం ఏర్పడింది.

 Crazy about wife, colleague kills MNC manager

రస్తోగి భార్య అంకీషాపై కన్నేసిన రిశ్విన్ ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. ఓసారి తనను వివాహం చేసుకుంటానని కూడా రిశ్విన్ ఆమెతో చెప్పాడు. ఆమె అందుకు నిరాకరించి, రిశ్విన్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. రస్తోగి, అంకీషాలు త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారనే వార్తను తెలుసుకున్న రిశ్విన్, అంకీషాను ఎలాగోలా దక్కించుకోవాలనుకున్నాడు. తనకు అడ్డుగా ఉన్న రస్తోగిని తొలగించాలనుకున్నాడు.

గత శనివారం రాత్రి 8.30గంటలకు రస్తోగి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన స్నేహితుడితోపాటు అక్కడికి వెళ్లాడు రిశ్విన్. సన్ సిటీలోని రస్తోగి ఫ్లాట్‌లోకి ప్రవేశించి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా రస్తోగిని పొడిచేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత రిశ్విన్ అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, తెలిసిన వ్యక్తులే హత్యకు పాల్పడ్డారనే కోణంలో, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు. అనుమానం వచ్చిన పోలీసులు, రిశ్విన్‌ను తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు అసలు నిజం ఒప్పుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+