వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషుల కోసం పురుషులు చేసిన రూల్స్‌- ఆర్మీలో మహిళా కమిషన్‌పై సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

భారత సైన్యంలో మహిళలు ప్రత్యేక, శాశ్వత కమిషన్‌ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయడానికి వారికి ఫిట్‌నెస్‌ అవసరమన్న నిబంధనను అత్యున్నత న్యాయస్ధానం తప్పుబట్టింది. మహిళలకు శాశ్వత కమిషన్ కోసం 80 మంది మహిళా అధికారులు దాఖల చేసిన పిటిషన్ విచారణ సంద్భంగా సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.

సైన్యంలో శాశ్వత కమిషన్‌ పొందడం కోసం వారికి ఫిట్‌నెస్‌ అవసరరమన్న నిబంధన ఏకపక్షంగా ఉందని, సహేతుకంగా లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు మన సమాజం పురుషుల కోసం పురుషుల చేత తయారు చేయబడిందన్న అంశాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించింది. సైన్యంలో సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎసిఆర్) మూల్యాంకనం, మెడికల్ ఫిట్నెస్ ప్రమాణాలు ఆలస్యంగా అమలు చేయడం మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. "మూల్యాంకనం యొక్క విధానం ఎస్ఎస్సి (షార్ట్ సర్వీస్ కమిషన్) మహిళా అధికారులకు ఆర్థిక మరియు మానసిక హాని కలిగిస్తుంది" అని కోర్టు తెలిపింది.

Created By Males, For Males: Top Court On Rules For Women Joining Army

2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సైన్యంలోని మహిళా అధికారులను పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలకు అర్హత పొందటానికి అనుమతించింది, దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన వాదనలు "వివక్షత", "కలతపెట్టేవి" మరియు స్టీరియోటైప్ నిబంధనల ఆధారంగా మహిళల సేవతో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉంటుందని కోర్టు తెలిపింది. కానీ దీన్ని అమలు చేయడంలో విఫలమైనందున కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని మహిళా అధికారులు కోరారు. అయితే ఆర్మీలోనూ శాశ్వత కమిషన్‌ను వారు కోరుకుంటున్నారు.

భారత వైమానిక దళం, నావికాదళం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశాయి. IAF మహిళలను ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీలలో అధికారులుగా అనుమతిస్తోంది.. మహిళా IAF షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులు హెలికాప్టర్, రవాణా విమానాలు, ఇప్పుడు ఫైటర్ జెట్లను కూడా నడుపుతున్నారు. నావికాదళంలో, లాజిస్టిక్స్, లా, అబ్జర్వర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మారిటైమ్ నిఘా పైలట్లు మరియు నావల్ ఆర్మేమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లలో ఎస్ఎస్సి ద్వారా ప్రవేశపెట్టిన మహిళా అధికారులను అనుమతిస్తున్నారు.

English summary
The medical fitness requirement for women to get Permanent Commission in the army is "arbitrary" and "irrational", the Supreme Court said today while pronouncing verdict on petitions filed by around 80 women officers for permanent commission in the army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X