Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటు: దుబాయ్ నుండి వచ్చిన పుజారా, క్యూలో బాబు

హైదరాబాద్/జైపూర్: ప్రముఖ క్రికెటర్ ఛటేశ్వర పుజారా దుబాయ్ నుండి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఐపిఎల్ ఆడుతున్న పుజారా ఓటు వేసేందుకే భారత్ వచ్చారు. గుజరాత్‌‌లోని రాజ్‌కోట్‌లో బుధవారం పుజారా ఓటు వేసి, వెంటనే దుబాయ్‌కు వెళ్లిపోతారు.

పార్లమెంటరీ ఎన్నికల్లో పుజారాను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం వినియోగించుకుంది. అయితే, ఓటు వేసేందుకు దుబాయ్ నుంచి పుజారా రావడం ఇతర ఓటర్లకు స్పూర్తినిస్తుందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

Cricketer Cheteshwar Pujara comes from Dubai to Rajkot to cast his vote

క్యూలైన్లో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటు వేసేందుకు హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని గాయత్రిహిల్స్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డారు. ఆయనతో పాటు భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మిణిలు నిలబడ్డారు.

అభినందించాలి: రాజశేఖర్

సినీ నటుడు రాజశేఖర్, అతని భార్య జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజశేఖర్ మాట్లాడుతూ... ఓటు వేసిన వారిని అభినందించాలన్నారు. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని, విద్యావంతులే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాకులు వెతుకుతున్నారన్నారు. అది మంచిపద్దతి కాదన్నారు. ఓటు వేసి తమ బాధ్యత నిర్వర్తించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+