ఆంటీ హత్య కేసులో ట్విస్ట్, 17 ఏళ్లకు కిల్లర్ అరెస్టు, హంతకుడు ఎవరో తెలుసా !

కేరళ/ తిరువనంతపురం: కేరళలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు సరిగ్గా 17 ఏళ్లు కష్టపడ్డారు. అలాగే అసలు హంతకుడు ఎవరో తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పట్టనంతిట్ట జిల్లా తిరువాళ్ల సమీపంలోని పుల్లాడ్‌లో 50 ఏళ్ల మహిళ హత్య కేసులో నిందితులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు మరెవరో కాదు చనిపోయిన మహిళ భర్త.

తాను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెబుతున్నప్పటికీ, కోర్టులో అభియోగం రుజువయ్యే వరకు నిందితుడి అసలు మ్యాటర్ వెలుగు చూడదని తెలిసింది. మహిళ హత్య కేసులో నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో కేసును మూసివేశారు. అయితే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ రీ ఓపెన్ చేసింది.

arrest2

రమాదేవి(50)ని ఆమె భర్త జనార్దనన్ నాయర్ హత్య చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరిశోధనలు 17 సంవత్సరాలుగా రహస్యంగా ఉండిపోయిన హత్య కేసులో హంతకుడు జనార్దన్ నాయర్‌ను అని సూచిస్తున్నాయని పోలీసులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో క్రైమ్‌ బ్రాంచ్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ రాజ్‌ నేతృత్వంలోని బృందం జనార్దన్ నాయర్ ను అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం నాయర్ కూడా నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. 2006 మే 26న రమాదేవి ఒంటిపై తీవ్రగాయాలతో ఇంట్లోనే శవమై కనిపించింది. అలాగే రమాదేవి మృతదేహంలో ఓ వైపు 36 వెంట్రుకలు, మరో వైపు 4 వెంట్రుకలు సహా 40 వెంట్రుకలను పోలీసులు గుర్తించారు.

హత్యకు కత్తిని పోలిన పదునైన వస్తువును ఉపయోగించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెలుగు చూసింది. ఈ హత్య కేసు విచారణ సుమారు నాలుగు సంవత్సరాలు జరిగింది. అయితే ఇంతలోనే కేసు చల్లారింది. రమాదేవి హత్య కేసులో ఆమె ఇంటి సమీపంలో నివసిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ కార్మికుడు కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

police

స్థానిక భవన నిర్మాణ కార్మికులను పోలీసులు విచారించగా రమాదేవిని హత్య చేసిన ఒకరోజు తర్వాత తమిళనాడుకు చెందిన అతను అదృశ్యమైనట్లు తెలిసింది.ఆ దిశగా తనిఖీలు నిర్వహించగా నిందితుడు, అతనితో పాటు ఉంటున్న మహిళ ఆచూకీ లభించలేదు. అలాగే జనార్దనన్ నాయర్ సోదరుడు మరో హత్య కేసులో నిందితుడు కావడంతో పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్థానిక పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన భర్త జనార్దన్ నాయర్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును సవాలు చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రమాదేవి హత్య కేసులో చివరికి ఆమె భర్త జనార్దన్ నాయర్ అరెస్టు కావడం సంచలనం రేపింది. రమాదేవి హత్య కేసులో విచారణ జరిపించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+