నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ.. బస్టాండ్‌లోనే నిందితుడికి 'పోలీస్ ట్రీట్‌మెంట్'! : Viral Video
అది చాలా రద్దీగా ఉన్న బస్టాండ్. ప్రయాణికులంతా బస్సుల కోసం ఎదురుచూస్తున్న సమయం. ఇంతలో ఓ పోలీస్ కార్ వచ్చి బస్టాండ్ ఆవరణ ఆగింది. అందులో నుంచి కొందరు పోలీసులు, తాళ్లతో కట్టేసిన ఓ వ్యక్తి బయటకు దిగారు. ఏం జరుగుతుందా అని జనమంతా గమనిస్తున్నారు. కట్ చేస్తే పోలీస్ స్టైల్ కోటింగ్ స్టార్ట్ అయింది? పిచ్చి కుక్కను కొట్టినట్టు.. కట్టేసి కొట్టడం, తిప్పుతూ కొట్టడం, బూటు కాలుతో తన్నడం.. చూస్తున్న వారంతా.. అయ్యో పాపం ఎందుకు అలా కొడుతున్నారు? అనుకున్నారు. కానీ అతడు చేసి ఘోరం తెలిసిన తర్వాత.. ఇలాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరితీయాలన్నారు
గుజరాత్‌లోని భవనగర్ సెంట్రల్ బస్టాండ్ ఆవరణలో పోలీసులు వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదే బస్టాండ్‌కు తీసుకువచ్చి 'సీన్ రీకన్‌స్ట్రక్షన్' చేశారు. అయితే కేవలం సీన్ రీక్రియేషన్‌తో సరిపెట్టకుండా, వందలాది మంది ప్రయాణికులు చూస్తుండగానే పోలీసులు నిందితుడిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. నిందితుడికి బుద్ధి చెప్పేలా లాఠీలకు పనిచెప్పడంతో బస్టాండ్ ఆవరణ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అనుమానంతో రగిలిపోతూ ఉన్మాదిలా ప్రవర్తన
కేసు వివరాల ప్రకారం.. 20 ఏళ్ల ఫైజల్ అలియాస్ ఖట్కీ లఖానీ, 40 ఏళ్ల కాజల్ బెన్ అనే మహిళతో కొన్నేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 3న భవనగర్ బస్టాండ్ వద్ద కాజల్ బెన్ తన స్నేహితుడితో మాట్లాడటం చూసిన ఫైజల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అనుమానంతో గొడవకు దిగి, అకస్మాత్తుగా ఉన్మాదిలా మారిపోయాడో. చుట్టూ జనాలు చూస్తున్నారనే భయం కూడా లేకుండా ఆమెను కిందపడేసి తలపై, ఒంటిపై పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తొక్కుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన బాధితురాలు
బస్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ రాక్షస దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ స్పష్టంగా నమోదయ్యాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయిన కాజల్ బెన్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న నీలంబాగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, పరారీలో ఉన్న నిందితుడు ఫైజల్‌ను అరెస్ట్ చేశారు.
పబ్లిక్‌లోనే థర్డ్ డిగ్రీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నీలంబాగ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం నిందితుడిని నేరం జరిగిన భవనగర్ బస్టాండ్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే నిందితుడికి పోలీసులు లాఠీలతో థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇచ్చారు. కాళ్లకు, చేతులకు తాడుతో కట్టేసి నడిరోడ్డుపైనే చితకబాదగా, నిందితుడు భయంతో కేకలు వేస్తూ క్షమించమని వేడుకున్నాడు. మహిళపై దారుణంగా దాడి చేసి హత్య చేసిన నేరస్తుడికి పోలీసులు పబ్లిక్‌గా ఈ రకంగా 'ట్రీట్‌మెంట్' ఇవ్వడంతో అక్కడున్న ప్రయాణికులు నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్ , పోలీసుల లాఠీఛార్జ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Shocking incident in Bhavnagar, Gujarat.
— 🚩Mohan Gowda🇮🇳 (@Mohan_HJS) September 6, 2026
Dalit Hindu woman Kajal Baraiya was brutally murdered in public by accused #Faizal .
Her brother was also assaulted while trying to save her.
The accused must face the strictest punishment under law.
Kudos to Bhavnagar Police. 👏 pic.twitter.com/9VHVwJv9DU














Click it and Unblock the Notifications