New Fastag Rules: అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్ కొత్త రూల్స్-తేడా వస్తే షాకులే..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల కష్టాల్ని తప్పించేందుకు జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాహనదారులు తమ వాహనాలకు చేసే ఫాస్టాగ్ రీఛార్జ్ ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే వీటిపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల పేరుతో జరుగుతున్న దోపిడీకి ఇది కొనసాగింపేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం దేశంలో ఇకపై బ్లాక్‌లిస్ట్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లపై లావాదేవీల్ని అనుమతించరు. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ చేసి ఉంటే టోల్ ప్లాజాకు చేరుకోవడానికి 60 నిమిషాల కంటే ముందు తక్కువ బ్యాలెన్స్‌గా మార్క్ చేయబడితే సదరు లావాదేవీ ని తిరస్కరిస్తారు. స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే చెల్లింపు కూడా తిరస్కరిస్తారు. ఈ రెండు షరతులు ఉల్లంఘిస్తే సిస్టమ్ ఎర్రర్ కోడ్ 176తో లావాదేవీని తిరస్కరిస్తుంది, అలాగే వాహనానికి పెనాల్టీగా టోల్ రుసుము కంటే రెట్టింపు వసూలు చేస్తారు.

Criticism over Fastag New Rules- here is why

అలాగే వినియోగదారులు తమ ఫాస్టాగ్ బ్యాలెన్స్ మొత్తం ఖర్చయిపోతే రీచార్జ్ చేసుకునేందుకు 70 నిమిషాల గ్రేస్ పిరియడ్ ఇస్తారు. వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ మార్చుకోవడానికి అంటే రీఛార్జ్ చేసుకోవడానికి, బ్లాక్ లిస్ట్ లో ఉంటే క్లియర్ చేసుకోవడానికి టోల్ బూత్‌కు చేరుకోవడానికి ముందు 70 నిమిషాల సమయం ఉంది. కానీ లావాదేవీని ప్రయత్నించిన 10 నిమిషాలలోపు పెనాల్టీ పడితే మాత్రం రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే పెనాల్టీ లేకుండా రెగ్యులర్ మొత్తం టోల్ ప్లాజా వద్ద చెల్లించవచ్చు. టోల్ రీడర్‌ను దాటిన తర్వాత 15నిమిషాల కంటే ఎక్కువ టోల్ లావాదేవీ ప్రాసెస్ జరిగితే వినియోగదారులకు అదనపు ఛార్జీలు ఉంటాయి. బ్యాంకులు లావాదేవీల తేడాలకు రిఫండ్ కోరాలంటే 15 రోజుల తర్వాతే అవకాశం ఇస్తారు.

ఫాస్టాగ్ తాజా రూల్స్ ప్రకారం ఇకపై చివరి నిమిషంలో రీఛార్జ్‌లు ఉండవు. టోల్ ప్లాజా‌ను చేరుకోవడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ చేయబడి ఉంటే, చివరి క్షణంలో రీఛార్జ్ జరగదు. పెనాల్టీ రీఫండ్ మాత్రం ఇకపై సాధ్యమవుతుంది. స్కానింగ్ చేసిన 10 నిమిషాల లోపు రీఛార్జ్ చేస్తే వినియోగదారులు రిఫండ్ కోరవచ్చు. అలాగే రెట్టింపు టోల్ ఛార్జీలను చెల్లించకుండా నివారించవచ్చు.టోల్ బూత్‌లలో ఆలస్యం, అదనపు ఛార్జీలు లేదా తిరస్కరణను నివారించడానికి వినియోగదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+