ప్రధాని మోడీని ఇంటికి పిలిచి విమర్శల పాలవుతున్న సుప్రీం ఛీఫ్ జస్టిస్..!

ప్రధాని నరేంద్రమోడీ తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం విమర్శలకు కారణమవుతోంది. ప్రధాని మోడీని తన ఇంట్లో గణేశ్ పూజకు ఆహ్వానించిన సీజేఐ చంద్రచూడ్ పైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై మోడీ కానీ, సీజేఐ కానీ ఇంతవరకూ స్పందించలేదు.

criticism over pm modi s participation in ganesh puja in cji dy Chandrachud s house

సీజేఐ ఇంట్లో గణేష్ పూజకు ప్రధాని మోడీ వెళ్లిన వ్యవహారంపై లాయర్ ప్రశాంత్ భూషణ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇందులో ఆయన "మోదీని తన నివాసంలో వ్యక్తిగతంగా కలుసుకునేందుకు సీజేఐ చంద్రచూడ్ అనుమతించడం దిగ్భ్రాంతికరం. కార్యనిర్వాహక వ్యవస్థ నుండి పౌరుల ప్రాథమిక హక్కును రక్షించే బాధ్యత మరియు ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పని చేస్తుందని నిర్ధారించే బాధ్యత కలిగిన న్యాయవ్యవస్థకు చాలా చెడ్డ సంకేతాలను పంపుతుంది. అందుకే కార్యనిర్వాహక మరియు న్యాయవ్యవస్థ మధ్య ఆయుధాల పొడవు వేరుగా ఉండాలి" అంటూ వ్యాఖ్యానించారు.

శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ మరింత ముందుకెళ్లి సీజేఐపై విమర్శలు గుప్పించారు. మోడీని ఇంటికి పిలిపించుకున్న ఆయన మనకు న్యాయం చేయగలరా అంటూ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. గణేష్ పూజ కోసం మోడీ ఎన్ని ఇళ్లకు వెళ్లారో తెలియదు కానీ సీజేఐ ఇంటికి వెళ్లి మాత్రం హారతి ఇచ్చారన్నారు. రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండాల్సిన వ్యక్తి రాజకీయ నేతల్ని ఇలా కలవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. శివసేన కేసులో కేంద్రం మరో పార్టీగా ఉందని, ఇప్పుడు సీజేఐ మోడీని కలిశారు కాబట్టి ఆయన ఈ కేసు విచారణకు దూరంగా ఉంటే మంచిందంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+