వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్‌పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)
చెన్నై: చెన్నైలోని ప్రముఖ టీవీ చానెల్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.

మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేసిన బాంబులను టీవీ చానెల్ కార్యాలయంపైకి విసిరారని పోలీసులు తెలిపారు. దుండగులు బాంబులు విసిరిన దృశ్యాలు టీనీ చానెల్‌లోని సీసీ కెమారాల్లో రికార్డైంది.

ఈ ఘటనపై ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తలైమురై చానల్ జర్నలిస్టులు తెలిపారు. టీవీ చానెల్ ప్రసారం చేసిన తాళి (మంగళసూత్రం) వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై సంస్థ ఆదివారం ఆందోళన నిర్వహించింది. ఆందోళన సందర్భంగా టీవీ సామాగ్రిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వీడియో జర్నలిస్టులపై దాడికి దిగారు.












Click it and Unblock the Notifications