సోషల్ మీడియాలో ఫేస్‌యాప్ సంచలనం.. వాడే ముందు జర భద్రం..

ఫేస్ యాప్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భవిష్యత్తులో ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తోంది. ఇండియన్ క్రికెట్ టీం సభ్యులు భారత క్రికెట్‌ జట్టు సభ్యులు వృద్దాప్యంలో ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా రూపొందించి షేర్ చేసిన ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా అందరూ ఫేస్ యాప్‌కు ఫిదా అయిపోయారు.

150 మిలియన్ల యూజర్లు

150 మిలియన్ల యూజర్లు

పలువురు సెలబ్రిటీలు ఫేస్ యాప్ ద్వారా వృద్ధాప్యంలో తమ ముఖాలు ఎలా ఉంటాయో ఫిల్టర్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ యాప్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటికి దాదాపు 150 మిలియన్ల మంది ఈ యాప్‌ను యూజ్ చేసి తమ ముఖాలు చూసుకుని మురిసిపోయారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది.

యూజర్ డేటాపై కంపెనీకి హక్కు

యూజర్ డేటాపై కంపెనీకి హక్కు

ఫేస్‌యాప్ వాడే ప్రతి వ్యక్తి ఆ యాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల్లో కంపెనీ ఓ మెలిక పెట్టింది. యూజర్లు యాప్‌లో స్టోర్ చేసే తమ సమాచారంతో పాటు ప్రాసెసింగ్ కోసం ఈ యాప్ సర్వర్లలోకి అప్‌లోడ్ చేసే ఫోటోలు ఇతర డేటాను ఫేస్ యాప్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇండియాలో యాప్ ఉపయోగించిన వ్యక్తుల ఫోటోలు, డేటాను ఈ యాప్ వేరే దేశాల్లో తమకు కావాల్సినట్లు ఉపయోగించుకోవచ్చు.

యూజర్ డేటాతో పబ్లిసిటీ

యూజర్ డేటాతో పబ్లిసిటీ

ఫేస్ యాప్ తమ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్‌ను యూజర్ల డేటాతో పబ్లిసిటీ చేసుకోవచ్చు. లేదా ఆ సమాచారాన్ని ఇతరులకు అమ్ముకోవచ్చు. యాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పినందున యూజర్లు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఈ డేటాను ఉపయోగించి ఫేస్ యాప్ ఫేస్ రికగ్నిషన్ స్మార్ట్ ఫోన్ అన్ లాకింగ్‌, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేయడం తదితర చర్యలకు పాల్పడే అవకాశముంది. ఈ విషయం తెలియని చాలా మంది యాప్‌ను వాడుతూ తమ డేటా, ఫోటోలను యాప్ సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూజర్లు ఫేస్ యాప్ వాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+