Cyclone Mocha: తీరానికి చేరువగా పెను తుఫాన్- అంచనాలకు మించి విధ్వంసం

కోల్‌కత: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్‌ ఇవ్వాళ తీరాన్ని తాకనుంది. ఈ మధ్యాహ్నం తరువాత బంగ్లాదేశ్-మయన్మార్ మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతవరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, మయన్మార్‌తో పాటు భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరాన్ని తాకే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అంచనా వేసిన దానికంటే మరింత విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదు.

ఈ నెల 6వ తేదీన ఆగ్నేయ బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా అవతరించింది. దీని ప్రభావంతో అప్పట్లో ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. తుఫాన్‌గా మారిన అనంతరం దీని దిశ మారింది. బంగ్లాదేశ్- మయన్మార్‌ వైపు ఈ తుఫాన్ తన దిశను మళ్లించుకుంది. ఈ మధ్యాహ్నానికి బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతం- మయన్మార్ ఉత్తర తీరాన్ని తాకనుది.

Cyclone Mocha

ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో మోచా తుఫాన్.. బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు ఐఎండీ తెలిపింది. క్రమంగా ఆగ్నేయ దిశగా కదులుతుందని అంచనా వేసింది. ఈ మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యాకౌ‌ప్యు-సిట్వె మధ్య తీరాన్ని దాటుతుందని వివరించింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, మయన్మార్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

అలాగే- పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. త్రిపుర, మిజోరం, మణిపూర్‌లల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.

Cyclone Mocha

ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరంలో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసింది. దక్షిణ 24 పరగణా జిల్లాలోని భక్కలి తీరంలో సివిల్ డిఫెన్స్ బృందాలను మోహరింపజేసింది. సివిల్ డిఫెన్స్ బృంద సభ్యులు తీర ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. స్థానికులను అప్రమత్తం చేస్తోన్నారు. తీరం వైపు వెళ్లొద్దంటూ మైకుల ద్వారా హెచ్చరికలను జారీ చేస్తోన్నారు.

దిఘాలో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేసినట్లు పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. 200 మంది కోస్ట్ గార్డ్‌ను మోహరింపజేసినట్లు పేర్కొంది. వారికి అదనంగా మరో వందమంది కోస్ట్ గార్డులను సిద్ధం చేశామని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+