తుపాను విలయం: కదిలిన మోదీ -గుజరాత్, డయ్యూలో ప్రధాని పర్యటన -సాయం ప్రకటిస్తారా?

కరోనా మహమ్మారి రెండో దశ విలయంతో బెంగాల్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడినప్పటి నుంచి ఢిల్లీకే పరిమితమై, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు మూడు వారాల తర్వాత తొలి పర్యటన చేపట్టనున్నారు. కరోనా నిర్వహణలో బిజీగా ఉన్న ఆయనను తౌక్తే తుపాను విలయం కదిలించింది. అందునా తన సొంత రాష్ట్రం గుజరాత్ తీవ్ర ప్రభావానికి గురికావడంతో ఆయన పర్యటనకు బయలుదేరనున్నారు..

అరేబియా సముద్రలో తలెత్తి, పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను కకావికలం చేసిన తౌక్తే తుపాను మిగిల్చిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించనున్నారు. గురువారం ఆయన గుజరాత్ సహా, డయ్యూలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎరియల్ సర్వే నిర్వహిస్తారు. తౌక్తే తుపాను గుజరాత్ వద్ద తీరం దాటడం, ఆ రాష్ట్రలో భారీ నష్టం వాటిల్లడం తెలిసిందే.

 Cyclone Tauktae Updates: PM Modi to visit Gujarat and Diu on wednesday, review situation

తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి గురువారం ఉదయం 9.30కు భావ్ నగర్ చేరుకుంటారు. అక్కడ్నించి ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఆపై అహ్మదాబాద్ లో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ భేటీలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తలెత్తిన అతిపెద్ద తుపానుగా గుజరాత్ లో తౌక్తే తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడి ఆస్తి నష్టంతోపాటు ఏడుగురు వ్యక్తులు మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. 16 వేళ్ల ఇళ్లకుపైగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ దళాల ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టి, దాదాపు 2లక్షల మందిని సురక్షిత ప్రాంతాలను తరలించడంతో ప్రాణనష్టం తగ్గింది. కాగా, రేపటి పర్యటనలో ప్రధాని మోదీ గుజరాత్, డయ్యూతోపాటు మహారాష్ట్రకు తుపాను సాయం ప్రకటిస్తారా లేదా అనేది కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+