వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 25 లక్షలు ఇవ్వకుంటే లేపేస్తా: మాఫియా డాన్

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్: ప్రసిద్ధి చెందిన అమూల్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సంస్థ ఎండీ ఆర్.ఎస్. సోధీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము చెప్పిన మామూళ్లు ఇవ్వకుంటే నిన్ను లేపేస్తామని, నీ ప్రాణాలు ఉండాలంటే తాము చెప్పిన నగదు సరైన గడుపులోపు ఇవ్వాలని బెదిరించారు.

హడలిపోయిన ఆర్. ఎస్. సోధీ అహమ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి పూజారి అనే వ్యక్తి రూ. 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్. ఎస్. సోధీ ఫిర్యాదు మేరకు కేసు అహమ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించామని ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు.

తాను ఫెడరేషన్ మీటింగ్ లో ఉన్న సమయంలో తొలిసారి ఫోన్ కాల్ వచ్చిందని సోధీ తన ఫిర్యాదులో తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు రవి పూజారి, నీకు తెలిసే ఉంటుందని పరిచయం చేసుకున్నాడని వివరించారు. మొదట తాను ఏదో వ్యాపారం పని మీద ఫోన్ చేసి ఉంటాడని అనుకున్నానని పోలీసులకు చెప్పాడు.

Dairy Major Amul’s Managing Director RS Sodhi gets extortion call

అయితే అతను బెదిరించిన తరువాత అతని నెంబర్ ను మరో అధికారి మొబైల్ యాప్ లో చెక్ చేయగా అతను గ్యాంగ్ స్టర్ అని తెలిసిందని సోధీ పోలీసులకు వివరించాడు. ఈ సంస్థమీద 36 లక్షల పేద కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పడానికి తాను ప్రయత్నించినా రవి పూజారి ఆ మాటలు పట్టించుకోలేదని అన్నారు

నీ కథలు నా దగ్గర చెప్పోద్దు, నేను చెప్పిన డబ్బులు ఇవ్వు, లేదంటే కాల్చిపారేస్తామని తీవ్రస్థాయిలో బెదిరించాడని వాపోయాడు.
మే మొదటి వారంలోనే సౌధీకి రవి పూజారి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడని కేసు ద్యాప్తు చేస్తున్న అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే.ఎన్. పటేల్ చెప్పారు.

ఫోన్లు అన్ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోట్ కాల్ (వీఓఐపీ) తో చెయ్యడం వలన బెదిరించిన వ్యక్తి నెంబర్ కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నామని వివరించారు. బెదిరింపు ఫోన్లు ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చాయని మాత్రం తెలుసుకున్నామని అన్నారు.

మాఫియా డాన్ రవి పూజారి కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన వాడు. విదేశాలలో తలదాచుకుని ఇప్పటికే అనేక మంది వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను తన అనుచరులతో దారుణంగా కాల్చి చంపించాడు.

English summary
According to crime branch officials, a person claiming to be a member of Pujari gang called Mr Sodhi a few days back and demanded Rs. 25 crore as protection money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X