దళిత బాలికలను యూనిఫాం తొలగించమని బలవంతం; ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక పాఠశాలలో దళిత బాలికలను యూనిఫామ్ తొలగించమని ఉపాధ్యాయులు ఫోర్స్ చేసిన కారణంగా వారిపై కేసు నమోదయింది. జులై 11న ఇద్దరు దళిత బాలికల యూనిఫాం తొలగించమని బలవంతం చేసినందుకు హాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

యూనిఫాం తొలగించి స్కూల్ డ్రెస్‌లో లేని మరో ఇద్దరు బాలికలకు ఇవ్వాలన్న టీచర్లు

యూనిఫాం తొలగించి స్కూల్ డ్రెస్‌లో లేని మరో ఇద్దరు బాలికలకు ఇవ్వాలన్న టీచర్లు

ఇద్దరు బాలికల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల దుస్తులలో విద్యార్థులందరినీ ఫోటోలు తీస్తున్నారని, అయితే తమ కూతుళ్ల యూనిఫాం తొలగించి స్కూల్ డ్రెస్‌లో లేని మరో ఇద్దరు బాలికలకు ఇవ్వాలని ఉపాధ్యాయులు చెప్పినట్టు వారు ఆరోపిస్తున్నారు. కులం కారణంగా తమ కుమార్తెలపై ఉపాధ్యాయులు వివక్ష చూపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. యూనిఫామ్ లు విప్పి వేరే వారికి ఇవ్వాలని బాలికలతో అనుచితంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు.

 యూనిఫాం ఇవ్వటానికి నిరాకరించిన విద్యార్థులు.. కొట్టి బలవంతంగా యూనిఫాం ల తొలగింపు

యూనిఫాం ఇవ్వటానికి నిరాకరించిన విద్యార్థులు.. కొట్టి బలవంతంగా యూనిఫాం ల తొలగింపు

యూనిఫామ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు చెప్పిన ఈ క్రమంలో తమ కుమార్తెలు యూనిఫాం ఇవ్వలేమని చెప్పడంతో, వారిని కొట్టి, యూనిఫామ్ తీసేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని టీచర్లను అడిగితే వారు సమాధానం చెప్పలేదని, పాఠశాలలో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని, తాము అలా చెయ్యలేదని మాత్రమే చెప్తున్నారని, అందుకే పోలీసులను ఆశ్రయించామని అని వారు చెబుతున్నారు. కేవలం కులవివక్షతోనే ఈ విధంగా జరిగిందని, బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు

తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, హాపూర్ మాట్లాడుతూ, సెక్షన్ 323 , 504, 166, 505, 355 , ఐపీసీ యొక్క సెక్షన్ 3 (2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఇద్దరు ఉపాధ్యాయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కుల వివక్ష కొనసాగుతుందని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు.. నిజమెంత?

కుల వివక్ష కొనసాగుతుందని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు.. నిజమెంత?

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ ఇంకా అనేక చోట్ల కుల వివక్ష కొనసాగుతున్నది అన్నది ప్రస్తుతం ఈ కేసుతో అర్థమవుతుంది. అయితే ఈ కేసులో టీచర్లు విద్యార్థులను యూనిఫామ్ తీసి ఇవ్వమన్నారా? టీచర్లు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు? నిజంగా కులవివక్షనే దీనికి కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. గతంలోనూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాయ్‌బరేలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై దాడి చేసి, అతడిని దారుణ హింసకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది.

 గతంలోనూ దళిత మైనర్ బాలుడిపై దాష్టీకం

గతంలోనూ దళిత మైనర్ బాలుడిపై దాష్టీకం


మైనర్ బాలుడిని అగ్ర వర్ణాలకు చెందిన కొందరు యువకులు ఘోరంగా అవమానించారు. అతడిని మోకాళ్ళపై కూర్చోబెట్టి వారి కాళ్ళు నాకమని హుకుం జారీ చేశారు. దళిత బాలుడు వారి కాళ్ళు నాకుతూ తీవ్రంగా భయపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశారు. ఇక తాజాగా స్కూల్ టీచర్లే దళిత విద్యార్థులను యూనిఫాం లు తీసి వేరే వారికి ఇవ్వాలని బలవంతం చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+