Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మధ్యప్రదేశ్ విజేతను తేల్చబోతున్న దళిత ఓట్లు-ఈసారి కాంగ్రెస్ కే మొగ్గు ?

మధ్యప్రదేశ్ లో ఈనెల 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదన్న అంచనాల నేపథ్యంలో ఇరు పార్టీలూ కీలకమైన దళిత ఓట్లపై దృష్టిసారించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దళితుల ఆరాధ్య దైవమైన కవి సంత్ రవిదాస్ ఆలయ నిర్మాణంతో పాటు పలు చర్యలు చేపట్టింది. అలాగే ఈ ఆలయం కోసం 53,000 గ్రామాల నుండి మట్టిని, 315 చిన్న నీటి ప్రవాహాల నుండి నీటిని సేకరించి నెల రోజుల పాటు రవిదాస్ స్మారక్ నిర్మాణ్ సమరస్తా యాత్రను నిర్వహించింది.

అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంత్ రవిదాస్ స్మారకార్థం సాగర్‌లో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇస్తోంది. ఎన్నికలకు ముందు దళితులను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సంత్ రవిదాస్ ఆలయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఇదో రాజకీయ జిమ్మిక్ అని, దేశంలో దళితులపై అఘాయిత్యాలు అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయని ఆరోపించారు.

dalit votes a deciding factor in madhya pradesh polls, experts says turn to congress this time

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 డేటా ప్రకారం, భారతదేశంలో దళితులపై అత్యధిక నేరాలు, దౌర్జన్యాలు మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2019లో రాజస్థాన్ ఇందులో అగ్ర రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు ఇవే అంశాలు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 రిజర్వుడు ఉన్నాయి. వీటిలో 47 ఎస్టీలు, 35 ఎస్సీలకు రిజర్వు చేశారు. రాష్ట్ర జనాభాలో SC, ST కుటుంబాలు 36 శాతం ఉన్నాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది నిర్ణయించడంలో వీరిదే ముఖ్యపాత్ర. రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ఆదివాసీలు ఆధిపత్యం చెలాయిస్తుండగా, దళితులు ఎక్కువగా వెనుకబడిన బుందేల్‌ఖండ్, వింధ్య , గ్వాలియర్-చంబల్ ప్రాంతాలలో ఉన్నారు.

2003, 2008, 2013 అసెంబ్లీ ఎన్నికలలో దళితులు బిజెపికి మద్దతు ఇచ్చారు. దీంతో మధ్యప్రదేశ్ లో ఆ పార్టీ సులువుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిది. గత 15 ఏళ్లలో బీఎస్పీ నుండి బీజేపీకి మారిన దళితుల ఓట్లు 2018లో స్వల్పంగా కాంగ్రెస్ వైపు మళ్లాయి. ఈసారి ఎన్నికల్లో 2018లో కంటే కాంగ్రెస్‌కు దళితుల ఓట్లు ఎక్కువగా వస్తాయని అంచనా. రాష్ట్రంలో కనీసం 60 నుండి 70 అసెంబ్లీ స్థానాలను దళితులు ప్రభావితం చేస్తారని బీజేపీ కూడా అంగీకరిస్తోంది. అందుకే బీజేపీ ఈసారి సంత్ రవిదాస్ కు గుడి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా... కాంగ్రెస్ మాత్రం దళిత సంఘాల డిమాండ్‌ మేరకు ఆయన పేరిట మెడికల్‌ కాలేజీ కమ్‌ హాస్పిటల్‌ నిర్మిస్తామని చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+