లుంగీ పైకి కట్టాడని చితకబాదారు
చెన్నై: పండుగ రోజు సరదాగా బీచ్ దగ్గరకు వెళ్లిన ఓ యువకుడు లుంగీ పైకికట్టుకున్నాడని ఆరోపిస్తూ చావు దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని తూతుకుడి లో ఈ సంఘటన జరిగింది.
తూతుకుడిలో మునియంది (21) అనే దళిత యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను దసరా పండుగ సందర్బంగా శుక్రవారం పట్టినం బీచ్ దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో అగ్రకులానికి చెందిన ఐదు మంది మునియందిని వీది చివరిలో పిలిచారు.

మాముందే నీవు మోకాళ్ల పైకి లుంగీ కట్టుకుని వెలుతావా ఎంత ధైర్యం అంటూ నిలదీశారు. అతన్ని నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి పీవీసీ పైపులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు.
అంతే కాకుండ గ్రామంలో దళితులు ఎవ్వరూ లుంగీలు పైకి కట్టుకుని తిరగరాదని, అది మా మర్యాదకు భంగం కలిగిస్తుందని, ఇంకెవరైనా ఇలా చేస్తే మీ అంతు చూస్తాం అని హెచ్చరించారు. తీవ్రగాయాలైన మునియందిని ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయంపై దళిత సంఘాలు మండిపడ్డాయి. వెంటనే తిరునల్వేలి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సమ్మకుట్టి, ఇసాయికుదుకురై, చెల్లా, ఆనంద్, దురై తదితరుల మీద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications