ఒకప్పుడు చౌక మద్యం, స్మగ్లింగ్‌కు అడ్డా.. ఇప్పుడు ప్రముఖ టూరిస్ట్ హబ్.. ఆనంద్ మహీంద్రా పోస్టుతో వైరల్..
భారత్ లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని ఒక్కో పర్యాటక ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంది. అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డామన్ అనే ముఖ్య పట్టణం గురించి తెలిస్తే వావ్ అంటారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం క్రమక్రమంగా మారిన విధానం చూస్తే సినిమా స్టోరీని మించి ఉంటుంది. ఒకప్పుడు స్మగ్లింగ్, మందుబాబులకు అడ్డాగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రముఖ టూరిస్ట్ హబ్ గా మారింది. పోర్చుగీస్ వాళ్లు మన దేశంలోకి మొట్టమొదటి సారిగా వచ్చిన విదేశీ వర్తకులు. డామన్ తో పాటు గోవా ఇతర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని క్రమంగా ఎదిగారు. ఇక భారత్ ను చివరగా వీడిన వాళ్లు కూడా పోర్చుగీసు వాళ్లే.. బ్రిటిష్ పాలకులు భారత్ ను విడిచి వెళ్లిపోయిన తర్వాత చాలా ఏళ్లపాటు గోవాను పరిపాలించారు పోర్చుగీస్ అలా 1970 కాలంలో భారత్ ను వీడారు. అప్పట్లో డామన్ కేంద్ర పాలిత ప్రాంతం కూడా వారి ఆధీనంలోనే ఉండేది.

ఇక అప్పట్లో డామన్ ప్రాంతాన్ని చౌక మద్యం, స్మగ్లింగ్ కేంద్రంగా పిలిచేవారు. ఇక ఆ కాలంలో గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉండేది. అలాగే మహారాష్ట్రలో మద్యంపై అధిక పన్నులు ఉండేవి. దాంతో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డామన్ ప్రాంతం చాలా ఏళ్ల పాటు 'డ్యూటీ- ఫ్రీ స్పిరిట్స్' హబ్ గా మారింది. సరిహద్దు లిక్కర్ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా డామన్ ఉండేదట. అయితే ఈ విషయాల్ని తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. డామన్ అప్పట్లో ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా మారిందో అని ఆయన వివరించారు. అప్పట్లో చౌక మద్యం, స్మగ్లింగ్ అడ్డా, సరిహద్దు లిక్కర్ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న డామన్ ప్రాంతం ఇప్పుడు అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఎలా మారిందనే అంశాన్ని వివరిస్తూ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Every coastal town has a backstory, but Daman’s reads like a movie script.
— anand mahindra (@anandmahindra) September 13, 2026
For decades after it was liberated from Portuguese rule, it became famous for something far less grand: cheap alcohol and cross-border liquor runs.
Sandwiched right next to dry Gujarat and high-tax… pic.twitter.com/vePoFfBeqN
తన చిన్నతనంలో డామన్ గురించి కథలు.. కథలుగా విన్నానని తక్కువ ఖర్చుతో వీకెండ్ మందు పార్టీల స్పాట్ గా డామన్ ఉండేదని ఆనంద్ మహీంద్రా గుర్తుచేసుకున్నారు. కానీ కాల క్రమేనా అది మారిపోయి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారిందని అన్నారు. డామన్ ప్రాంతాన్ని ఇప్పుడు చూస్తే ఆ పాత ఆనవాళ్లేవీ కనిపించవని.. పాత ముద్రలన్నీ చెరిగిపోయి.. డామన్ సరికొత్త టూరిజం డెస్టినేషన్ గా రూపుదిద్దుకుందని వివరించారు. ఈ మేరకు గతంలో మనపై పడిన ముద్రలు మన శాశ్వత గమ్యస్థానాలు కానక్కర్లేదనే సందేశంతో ఆనంద్ మహీంద్రా తన పోస్టును ముగించారు. ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్ కావడంతో డామన్ పర్యాటకంపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
