ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం, గాలి నాణ్యత ఎంతగా క్షీణించింది అంటే !!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. వాయు కాలుష్యం ఢిల్లీని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటిగా మారింది. వాయు కాలుష్యం నివారించడానికి ఢిల్లీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక దీపావళి పండుగ సమయంలో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే దీపావళికి బాణాసంచా కాల్చడాన్ని, అమ్మడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రించడానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ ప్రమాదంలో ఉంది. వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను భయపెడుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అరికట్టటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కాలుష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చినా ఫలితం మాత్రం శూన్యం గా ఉంది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్యానికి కారణం అయ్యే వారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో దిగజారిన గాలి నాణ్యతా సూచీ
తాజాగా ఢిల్లీలో దీపావళి పర్వదినం సందర్భంగా మరింత వాయుకాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం వాయు కాలుష్యం పెరిగిందని దీపావళి పండుగ నేపథ్యంలో గాలి నాణ్యత సూచిక మరింత దిగజారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచి 300 కంటే ఎక్కువగా నమోదైంది. గురువారం సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

దీపావళి నాడు ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత క్షీణత
ఢిల్లీలో దీపావళి "ప్రమాదకర" గాలి-నాణ్యత సంకేతంతో ప్రారంభమవుతుంది అన్న సంకేతాలు వెల్లడయ్యాయి. గాలి నాణ్యత సూచిక 'ప్రమాదకర' స్థాయిలో ఉంది. నోయిడా 526తో గాలి నాణ్యతా సూచీలో వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో ఉంది, ఢిల్లీ యొక్క పూసా రోడ్ 505తో తర్వాతి స్థానంలో ఉంది. ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉంది. సున్నా నుండి 50 మధ్య గాలి నాణ్యత సూచి ఉంటే నాణ్యత బాగా ఉన్నట్టు అర్ధం. 51 మరియు 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని , 101 మరియు 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 మరియు 300 ఉంటే చాలా తక్కువ నాణ్యత ఉన్నట్టుగా, 301 మరియు 400 'చాలా పేలవమైనది' మరియు 401 మరియు 500 కు వస్తే ప్రమాదకరస్థాయి అని సూచన.
Recommended Video

దీపావళికి బాణాసంచా బ్యాన్ చేసిన ఢిల్లీ , అయినా పెరిగిన పొల్యూషన్
గాలి నాణ్యతను వాయు కాలుష్య ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీపావళికి పెను ప్రమాదం ముంచుకు రాకుండా దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయించడం, కాల్చడం నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులను నిల్వ చేయడం, విక్రయించడం , పేల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గత మూడు సంవత్సరాలలో దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోవడంతో, ప్రస్తుత కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా సరే గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో నమోదు కావటం ప్రధానంగా కనిపిస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications