Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుమార్తె కులాంతర వివాహం; భార్య, మరో ఇద్దరు కూతుళ్ళను హతమార్చి.. తండ్రి ఆత్మహత్య

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ కులాలు, మతాలు పట్టింపుతో సొంత కుటుంబాలనే కడతేరుస్తున్న వారు లేకపోలేదు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో జరిగిన ఉదంతం అందుకు అద్దం పడుతోంది. తన కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కలత చెందిన ఓ వ్యక్తి, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో తన భార్య మరియు మైనర్‌తో సహా ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు.

కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని భార్యా, పిల్లలను హతమార్చి సూసైడ్ చేసుకున్న వ్యక్తి

కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని భార్యా, పిల్లలను హతమార్చి సూసైడ్ చేసుకున్న వ్యక్తి

నాగపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి జవహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, టీ దుకాణం నడుపుతున్న లక్ష్మణన్ తన పెద్ద కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కోపంతో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యను మరో ఇద్దరు కుమార్తెలను హతమార్చి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకున్నాడు.

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తె క్షేమం

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తె క్షేమం

ప్రస్తుతం ఈ దారుణ ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.తల్లిదండ్రులను కాదని కులాంతర వివాహం చేసుకున్న కుమార్తె ప్రస్తుతం భర్తతో కలిసి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని కొన్ని జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో నేటికీ కులాంతర వివాహాలపై కుల వివక్ష మరియు బంధువుల దాడులు ప్రబలంగా కొనసాగుతున్నాయి.

తమిళనాడులో గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఉదంతాలెన్నో

తమిళనాడులో గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఉదంతాలెన్నో

2016లో, తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమల్‌పేట్‌లో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక యువకుడిని పట్టపగలు అతని అగ్రవర్ణ హిందూ భార్య కుటుంబం కిరాయి గూండాలతో హత్య చేయించారు. హంతకులు 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వి. శంకర్‌ను నరికి చంపారు. అతనిని పెళ్లి చేసుకున్నందుకు అతని భార్య కౌసల్యను తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో కౌసల్య తండ్రి చిన్నస్వామి సహా ఆరుగురికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తరువాత, 2020లో, మద్రాస్ హైకోర్టు మహిళ తండ్రిని నిర్దోషిగా ప్రకటించింది . మిగిలిన వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

కులాంతర వివాహాలు .. శవాలుగా మారుతున్న కుటుంబాలు

కులాంతర వివాహాలు .. శవాలుగా మారుతున్న కుటుంబాలు

మరో రెండు సంఘటనలలో, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల పురుషులు అగ్రవర్ణాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్న తర్వాత రైలు పట్టాలపై శవమై కనిపించారు. కులాంతర వివాహాలపై నేటికీ తమిళనాడులోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్లో దారుణమైన అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోనే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా కులం, మతం పట్టింపులతో ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం దారుణమైన విషయమని గుర్తించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు లోని గ్రామీణ ప్రాంతాలలో పేరుకుపోయిన మూఢవిశ్వాసాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+