Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముక్కు ద్వారా బూస్టర్ డోస్: భారత్ బయోటెక్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ట్రయల్స్‌తో

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వేర్వేరు రూపాల్లో విరుచుకుపడుతోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. కరోనా వైరస్ బలహీనపడుతోందనుకున్న ప్రతీ సందర్భంలోనూ దాని కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. ఇదివరకు డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భయాందోళనలకు గురి చేశాయి. దాన్ని తీవ్ర తగ్గిందనుకునే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తిలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

భారత్‌లోనూ దీని తీవ్రత కొనసాగుతోంది. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,51,209 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 627 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. 3,47,443 మంది కోలుకున్నారు. దీనితో దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,06,22,709కి చేరింది. యాక్టివ్ కేసులు 21,05,611గా రికార్డయ్యాయి. 4,92,327 మంది ఇప్పటిదాకా మరణించారు.

DCGI gives permission to Bharat Biotech for Intranasal booster dose trials, will be done at 9 different sites

మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటిదాకా 1,64,44,73,216 డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒమిక్రాన్ తోడైన తరువాత దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ముక్కు ద్వారా (ఇంట్రానాసిల్) బూస్టర్ డోసులను ఇవ్వడానికి అవసరమైన అనుమతులను తాజాగా పొందింది భారత్ బయోటెక్ మేనేజ్‌మెంట్. ఈ మేరకు ఈ కంపెనీ యాజమాన్యం దాఖలు చేసుకున్న ప్రతిపాదనలపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ కొద్దిసేపటి కిందటే ఆమోదముద్ర వేసింది. దీనితో- దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది ప్రాంతాల్లో ఇంట్రానాసిల్ బూస్టర్ డోసులను ఇవ్వడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టనుంది భారత్ బయోటెక్.

Recommended Video

    COVID 19 Vaccination: Centre's New Rule Including Precaution Dose | Oneindia Telugu

    ఒక్కో ప్రదేశంలో వంద మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. మొత్తంగా 900 మందిపై ఈ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని డీసీజీఐ భారత్ బయోటెక్ యాజమాన్యానికి సూచించింది. ఇవి ముగిసిన వెంటనే బూస్టర్ డోసులను అందుబాటులోకి తీసుకొస్తుందీ ఫార్మా కంపెనీ. భారత్ బయోటెక్ అందజేసిన ప్రతిపాదనలపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఇచ్చిన సిఫారసుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+