జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . తాజాగా శ్రీనగర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. మెరుపుదాడి చేసిన టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

 ఉగ్ర దాడి .. కిలో ఫోర్స్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి

ఉగ్ర దాడి .. కిలో ఫోర్స్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి

ఇటీవల నగోట్రా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు ఈ ఎన్నికలలో విధ్వంసం సృష్టించడానికి వచ్చారని భద్రతా బలగాలు తేల్చిచెప్పిన నేపథ్యంలో, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదా అన్న ఆందోళనకు కారణమవుతున్నాయి. శ్రీనగర్ శివార్లలో ఉన్న హెచ్ఎంటి ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో కిలో ఫోర్స్ కు చెందిన ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు.

ముంబై దాడి ఘటన రోజే జమ్మూలో ఉగ్ర వాదుల మెరుపుదాడి

ముంబై దాడి ఘటన రోజే జమ్మూలో ఉగ్ర వాదుల మెరుపుదాడి

ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై మెరుపు దాడి చేసి వారిపై కాల్పులు జరిపారు. ఇద్దరు సైనికులను విచక్షణరహితంగా గాయపరిచారు ఉగ్రవాదులు. దీంతో జవాన్లు మరణించారు . నవంబర్ 26 ముంబై లో ముష్కరుల దాడికి 12 వ వార్షికోత్సవం రోజునే ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపెనింగ్ పార్టీ పై దాడి జరిగిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి . కాశ్మీర్ పోలీసులు , సి ఆర్ పి ఎఫ్ ర్యాలీ, క్యూ ఏటీ ఉగ్రవాదులు దాడి చేసిన పరిసర ప్రాంతాల్లో మోహరించాయి. వారిని పట్టుకోవడం కోసం ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది.

జమ్మూకాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల సమయంలో టెన్షన్

జమ్మూకాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల సమయంలో టెన్షన్

ఇక ఈ దాడి ఘటనపై కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు మరియు ఇద్దరు అమరులయ్యారు అంటూ పేర్కొన్నారు. కారులో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారని, ఇద్దరు విదేశీ ఉగ్రవాదుల కాక మరొక వ్యక్తి స్థానికుడు కావచ్చని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్న కారణంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+