వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో క్షీణిస్తున్న కరోనా : తాజాగా 18,833 కేసులు, 278 మరణాలు, యాక్టివ్ కేసులు ఎన్నంటే!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20 వేలకు తక్కువగా కేసులు నమోదు కావడం కాస్త ఊరట నిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశం 18,833 కేసులను నివేదించింది. భారతదేశం 278 మరణాలను నివేదించింది. నిన్న కూడా భారతదేశంలో 20 వేల కంటే దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక నేడు వరుసగా రెండో రోజు దేశం 18 వేల పైచిలుకు కేసులను నమోదు చేసింది. నిన్నటి కంటే కాస్త కేసులు పెరిగినట్లు కనిపించినా, మొత్తంగా చూస్తే దేశంలో కరోనా ఉధృతి తగ్గుతుంది.

బాగా తగ్గినా క్రియాశీల కేసులు ..ప్రస్తుతం 2.46 లక్షల యాక్టివ్ కేసులు
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 14,09,825 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. నిన్న ఒక రోజు 24,770 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.31 కోట్లకు చేరింది. ఇక రికవరీ ల శాతం 97.14 గా నమోదయింది. కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసులు మరింత క్షీణించి ప్రస్తుతం దేశంలో 2.46 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. యాక్టివ్ కేసుల శాతం 0.23 శాతంగా ఉంది.

Declining corona in India: latest 18,833 cases, 278 deaths, active cases

నిన్న ఒక్కరోజే 278 మంది మృతులు .. కేరళలో పరిస్థితి ఇలా
కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 278 మంది కాగా ఇప్పటివరకు కరోనా మహమ్మారికి 4,495,38 మంది బలైపోయారు. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కేసులు, మరణాలలో అత్యధిక శాతం ఒక్క కేరళ రాష్ట్రం నుండే నమోదు అవుతుండడం గమనార్హం. కేరళలో ఉధృతంగా ఉన్న కరోనా గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో తాజాగా 9,735 కరోనా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇది రోజువారీ కేసులలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముందుంది. కేరళ రాష్ట్రంలో 151 కోవిడ్ మరణాలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.

మహారాష్ట్ర ,తమిళనాడు, కర్ణాటకలలో తాజా పరిస్థితి ఇది
ఇదిలా ఉంటే కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,401 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిన్న 39 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే తమిళనాడులో తాజా కేసులు 1,449 గా ఉన్నాయి. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన రెండవ దక్షిణాది రాష్ట్రం . తమిళనాడు రాష్ట్రం నిన్న 16 మరణాలను నివేదించింది.పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇది 24 గంటల వ్యవధిలో 522 కేసులు మరియు 13 మరణాలను నివేదించింది. గురువారం ప్రారంభమయ్యే మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది మరియు కళాకారులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్ టి పి సి ఆర్ పరీక్ష నివేదికను, కనీసం ఒక మోతాదు కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది.

మిజోరాంలో కేసుల పెరుగుదల .. అతి పెద్ద రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల ఇలా
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో 619 తాజా కేసులు, 11 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్ తాజాగా ఒక కోవిడ్ కేసుతో, మధ్యప్రదేశ్ 10 కేసులతో, బీహార్ రెండు కేసులతో అతి తక్కువ కరోనా కేసులను నమోదు చేశాయి. ఈ మూడు పెద్ద రాష్ట్రాలు - జీరో కోవిడ్ మరణాలను నివేదించాయి. పర్యాటక ప్రాంతమైన గోవాలో గత 24 గంటల్లో 86 కొత్త కేసులు మరియు రెండు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ 20 తాజా కేసులు మరియు రెండు కోవిడ్ మరణాలను నివేదించగా, పొరుగున ఉన్న ఢిల్లీలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మరణాలు నమోదు కాలేదు. 1,471 కేసులతో మిజోరాం ఈశాన్య రాష్ట్రాలలో రోజువారీ కేసులలో అత్యధిక సంఖ్యలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో ఏడు కోవిడ్ మరణాలు కూడా నమోదయ్యాయి.

English summary
The corona epidemic in India seems to have declined. India has reported 18,833 cases in the last 24 hours. India reported 278 deaths. There are currently 2.46 lakh active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X