క్షీణిస్తున్న క్రియాశీల కేసులు; దేశంలో కరోనాకేసుల తాజా పరిస్థితి ఇదే!!

భారతదేశంలో కరోనా కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. నిత్యం రెండు వేలను నుంచి కాస్త హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 2,858 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కరోనా కేసులు మునుపటి రోజుతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,31,19,112 కు చేరుకుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ రోజు యాక్టివ్ కేసులు 18,096కి తగ్గాయి. ఈరోజు 11 కొత్త మరణాలతో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,24,201కి చేరుకుందని డేటా పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 24 గంటల వ్యవధిలో 508 కి తగ్గినట్టు సమాచారం.

Declining Covid active cases; This is the latest situation of corona cases in India !!

మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ సానుకూలత రేటు 0.59 శాతంగా మరియు వారపు సానుకూలత రేటు 0.82 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 191.15 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. గత 24 గంటల్లో 3,355 రికవరీలు నమోదు కాగా, ఇప్పటివరకు మొత్తం రికవరీలు 4,25,76,815 గా నమోదయ్యాయి. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 84.34 కోట్లు; గత 24 గంటల్లో 4,86,963 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ డేటా వెల్లడించింది.

ఇదిలా ఉంటే భారతదేశం నుండి విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్ డోస్ వ్యవధిలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండవ డోస్ కు బూస్టర్ డోస్ కు మధ్య అంతరాన్ని తొమ్మిది నెలల నుంచి 90 రోజులకు కేంద్రం కుదించింది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలను చేపడుతుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. మొత్తానికి కరోనా ఫోర్త్ వేవ్ ఆందోళన తాజాగా కరోనా కట్టడితో కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+