వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీప్ సిద్ధూ రిపబ్లిక్ డే రోజు హింస ఘటనలో లేడు, నిందితుడనే ఆధారాలు లేవు : ఢిల్లీ కోర్టులో వాదన

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న చెలరేగిన హింస వెనుక పంజాబీ నటుడు ,కార్యకర్త దీప్ సిద్ధు లేడని ఢిల్లీ కోర్టులో ఆయన న్యాయవాది వాదించారు. సిద్దూ బెయిల్ పిటిషన్ గురువారం ఢిల్లీ కోర్టులో విచారణకు రావడంతో ఆయన న్యాయవాది దీప్ సిద్దూ ఒక వీడియోను సోషల్ మీడియాలో మాత్రమే పోస్ట్ చేసారని , హింస జరిగినచోట దీప్ సిద్దు లేరని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

ఎర్రకోట వద్దకు దీప్ సిద్ధు , ఇక్బాల్ సింగ్ ... రిపబ్లిక్ డే నాటి హింస, సీన్ రీక్రియేట్ చేస్తున్న పోలీసులు ఎర్రకోట వద్దకు దీప్ సిద్ధు , ఇక్బాల్ సింగ్ ... రిపబ్లిక్ డే నాటి హింస, సీన్ రీక్రియేట్ చేస్తున్న పోలీసులు

సోషల్ మీడియా లో మాత్రమే దీప్ సిద్ధూ పోస్ట్ .. నిందితుడిగా చిత్రీకరించారని వాదన

సోషల్ మీడియా లో మాత్రమే దీప్ సిద్ధూ పోస్ట్ .. నిందితుడిగా చిత్రీకరించారని వాదన

కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయనను రిపబ్లిక్ డే హింసకు ప్రధాన నిందితుడిగా మీడియాలో చిత్రీకరించారని అతని న్యాయవాది వాదించారు. అంతేకాదు ప్రతి తప్పు నేరం కాదని అన్నారు. కోర్టు ఈ పిటీషన్ విచారణను ఏప్రిల్ 12 కి వాయిదా వేసింది . అంతేకాదు దీప్ సిద్ధు ప్రసంగాల లిఖిత పత్రాలను కోర్టు ముందు సమర్పించాలని ఆదేశించింది. తాను ఏ రైతు సంఘంలోనూ సభ్యుడిని కాదని పేర్కొన్న దీప్ సిద్దూ న్యాయవాది ఈ నిరసనకు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారని చెప్పారు.

 ఎర్రకోటలో హింస సమయంలో దీప్ సిద్ధూ అక్కడ లేడు

ఎర్రకోటలో హింస సమయంలో దీప్ సిద్ధూ అక్కడ లేడు

సిద్దూ ఎర్ర కోటకు వెళ్ళమని ఎవరికీ పిలుపు ఇవ్వలేదని , హింస చెలరేగినప్పుడు అతను అక్కడ కూడా లేడని ఆయన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఎర్రకోట వద్ద ఆయన హింసాత్మక ఘటనలకు , ఆయన జనాన్ని సమీకరించాడని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాది చెప్పారు.

కాబట్టి దీప్ సిద్ధూ కు బెయిల్ మంజూరు చెయ్యాలని కోరారు. అయితే కోర్టు ఈ కేసును ఏప్రిల్ 12 కి వాయిదా వేసింది.

కిసాన్ పరేడ్ లో హింస ఘటనలో దీప్ సిద్ధూపై ఆరోపణలతో అరెస్ట్

కిసాన్ పరేడ్ లో హింస ఘటనలో దీప్ సిద్ధూపై ఆరోపణలతో అరెస్ట్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సమీపంలో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై ఫిబ్రవరి 9 న ఢిల్లీ పోలీసులు దీప్ సిద్ధును అరెస్ట్ చేశారు. సెప్టెంబరులో పార్లమెంటులో ఆమోదించిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాల రద్దుకు ఆందోళన బాట పట్టారు . ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున, ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టి కిసాన్ పెరేడ్ నిర్వహించారు. కిసాన్ పెరేడ్ ఉద్రిక్తంగా మారడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

దీప సిద్ధూ బెయిల్ పిటీషన్ .. విచారణ ఏప్రిల్ 12 కి వాయిదా

దీప సిద్ధూ బెయిల్ పిటీషన్ .. విచారణ ఏప్రిల్ 12 కి వాయిదా


ఈ ఘటనలతో కేంద్ర సర్కార్ పలువురు ఉద్యమకారులపై కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా దీప్ సిద్ధుని పేర్కొంది.
ఎర్రకోట వద్ద జెండా ఎగరవేసిన కేసులో ప్రధానంగా దీప్ సిద్ధూ, జుగ్రాజ్ సింగ్ , గుర్జంత్ సింగ్ నిందితులని, ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది . ఆ తర్వాత దీప్ సిద్ధూను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం దీప్ సిద్దూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు . ఈ పిటీషన్ విచారణను ఏప్రిల్ 12 కి వాయిదా వేసింది .

English summary
Punjabi actor-turned-activist Deep Sidhu is not behind the violence that erupted in the Capital on January 26, his lawyer said as Sidhu's bail plea came up at a Delhi court on Thursday. Deep Sidhu only posted a video on social media, for which he has been named in media as a main accused of the Republic Day violence, his lawyer said,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X