వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత అనుమానాస్పద మృతి, దీపా భర్త అఫిడవిట్లు, 18 అంతుచిక్కని అనుమానాలు !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిటీ ముందు అమ్మ మేనకోడలు దీపా భర్త మాధవన్ అఫిడవిట్లు దాఖలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిటీ ముందు అమ్మ మేనకోడలు దీపా భర్త మాధవన్ అఫిడవిట్లు దాఖలు చేశారు. అమ్మ జయలలిత మృతిపై 18 అంతుచిక్కని అనుమానాలు వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అమ్మ జయలలిత మరణించిన సమయంలో ఆమె పార్థీవదేహం చూసిన వారందరికి ఎదురైన ప్రశ్నను దీపా భర్త మాధవన్ విచారణ కమిటీ ముందు ప్రస్తావించారు. జయలలిత మరణించిన సమయంలో ఆమె బుగ్గు మీద రంధ్రాలు పడినట్లు అందరికీ తెలిసిందని, ఆ విషయంలో అనుమానాలు ఉన్నాయని దీపా భర్త మాధవన్ విచారణ కమిటీ ముందు ప్రస్తావించారు.

Deepa's husband Madhavan filed affidavits at Justice Arumugasamy comittee

జయలలిత మరణంపై అంతుచిక్కని 18 అనుమానాలు ఉన్నాయని దీపా భర్త మాధవన్ హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి దగ్గర అఫిడవిట్లు దాఖలు చేశారు. జయలలితకు చికిత్స చేసిన సమయంలో ఆమె బుగ్గ మీద రంధ్రాలు పెట్టామని, పెట్టలేదని చికిత్స చేసిన వైద్యుల నుంచి ఎలాంటి స్పష్టమైన వివరాణ రాకపోవడంతో అమ్మ మేనకోడలు దీపా భర్త విచారణ కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు.

జయలలిత మరణంపై ఎవరికైనా అనుమానాలు ఉన్నా, అమ్మ చికిత్సకు సంబంధించి ఎవైనా సాక్షాధారాలు ఉన్నా మమల్ని సంప్రధించాలని హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిటీ చెప్పిన నేపథ్యంలో పలవురు అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ నాయకులు విచారణ కమిటీని సంప్రధిస్తున్నారు.

English summary
Jayalalitha neice J.Deepa's husband Madhavan filed affidavits at Justice Arumugasamy comittee regarding 18 mysterious questions in the Jayalalitha's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X