భారత్‌- పాకిస్థాన్ యుద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్, పఠాన్ కోట్, ఉదమ్ పూర్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోంది. మార్గదర్శకాల ప్రకారం దీటుగా తిప్పుకొడుతోంది భారత సైన్యం. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది.

ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ.. పాకిస్థాన్‌ కు చెందిన JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అదేవిధంగా 12 అత్యాధునిక డ్రోన్లతో పాటు S 400 వ్యవస్థను ప్రయోగించి గాల్లోనే ధ్వంసం చేసింది. ఈ మేరకు JF-17 యుద్ధ విమానాలు కూలిపోయినట్లు పాకిస్థాన్ కూడా ధృవీకరించింది. మరోవైపు భారత్- పాక్ సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. జమ్ము, జైసల్మేర్, జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో ప్రత్యర్థి పాక్‌ దాడికి పాల్పడకుండా.. పవర్ కట్ చేశారు.

భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్,సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్​ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్​లను కూల్చేసింది.

Defence Ministry Issues Statement on Pakistan s Drone and Missile Attacks

కాశ్మీర్ లో పాకిస్థాన్‌ 8 మిసైల్స్‌,10 డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్‌, డ్రోన్ల ను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది. జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబా, ఆర్ఎస్‌పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్‌ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్ల ను సమర్థవంతంగా కూల్చివేసింది.

మరోవైపు ఆత్మాహుతి దాడులను నమ్మొద్దని రక్షణశాఖ తెలిపింది.రాజౌరీలోని ఆర్మీ బ్రిగేడ్ పై ఆత్మాహుతి దాడులంటూ అసత్య ప్రచారమని పేర్కొంది. ఎక్కడా ఎలాంటి ఆత్మాహుతి దాడులు జరగలేదని తెలిపింది. అలాంటి సమాచారం నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+