వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ రాజధానిలో వర్ష బీభత్సం: గత 46 ఏళ్లలో ఎరుగని వర్షాలు, వరదనీటిలో ఎయిర్‌పోర్ట్, రహదారులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు బీభత్సం సృష్తిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఇప్పటికే వర్షం ఆగడం లేదు. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

అంతేగాక, ఢిల్లీ విమానాశ్రయం రన్ వేలోనే గాక, విమానాశ్రయంలోకి కూడా వరదనీరు చేరింది. దీంతో పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఏయిర్‌ పోర్టులోకి వరద నీరు చేరింది. ప్రవేశ ద్వారం వద్ద నుంచి లోపల వరకు వరద నీరు చేరింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని పేర్కొన్నాయి.

Delhi airport flooded after record highest rainfall in 46 years, City On Orange Alert

మరోవైపు, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతంలో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి భారీవర్షం కురిసింది. శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కొనసాగింది. శుక్రవారం రాత్రి నుంచి దేశ రాజధానిలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 46ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Recommended Video

Rashid Khan Steps Down As Afghanistan Captain | ACB | T20 WC Squad || Oneindia Telugu

కాగా, వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద పోటెత్తింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. దేశ రాజధాని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో దేశ రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగితే కష్టమేనంటున్నారు ఢిల్లీ వాసులు.

English summary
Delhi airport flooded after record highest rainfall in 46 years, City On Orange Alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X