ఆప్ నేతలకు సినిమా చూపించిన మాజీ మంత్రి తోమర్
న్యూఢిల్లీ: ఢిలీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహ ఆప్ నేతలకు చుక్కలు చూపించాడు. ఇంత కాలం తాను ఒక న్యాయవాదిని అని అందరికి ప్రచారం చేసుకున్న తోమర్ ఇప్పుడు నేను ఏ ఎల్ఎల్ బీ చెయ్యలేదని పోలీసుల విచారణలో అంగీకరించాడు.
ఈ దెబ్బతో నీతి నిజాయితీకి మారు పేరు తామేనని చంకలు గుద్దుకుంటున్న ఆప్ నేతలు తలలు పట్టుకున్నారు. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని ఢిల్లీ న్యాయశాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ తోమర్ ను గత వారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తోమర్ పోలీసుల విచారణలో అసలు విషయం అంగీకరించాడు. తను చదువులో వెనుకబడ్డానని అందుకే నకిలి సర్టిఫికెట్లు తీసుకున్నాని చెప్పారు. ఇదే సమయంలో మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తన సోదరుడు పీఎస్ తోమర్ పాత్ర గురించి పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది.

సోదరులు ఇద్దరు కలిసి వినోద్ అనే న్యాయవాదిని కలిశారు. తరువాత వినోద్ సహాయంతో షాకర్ పూర్ లో ప్రయివేటు స్కూల్ నిర్వహిస్తున్న మదన్ అనే ఏజెంట్ ద్వార 2001లో బీఎస్సీ డిగ్రీ (నకిలి) తీసుకున్నారు. భగల్ పూర్ యూనివర్శిటి నుండి ఎల్ఎల్ బీ పట్టా సంపాదించారని విచారణలో అంగీకరించాడు.
రాజకీయాలలో పైకి రావాలన్నా, సమాజంలో గౌరవం ఉండాలన్నా డిగ్రీలు తప్పనిసరి అని తీసుకున్నానని, అంతే కాని ఎవ్వరిని మోసం చెయ్యలేదని తోమర్ పోలీసులకు చెప్పారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ కు నకిలి ఎల్ఎల్ బీ సర్టి ఫికెట్లు ఇచ్చానని తోమర్ అంగీకరించారు.












Click it and Unblock the Notifications