వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi assembly results 2020: బెట్టింగ్ బజార్ లో ఆప్ హవా, బీజేపీ కథ క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 2020లో అమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీలో ఇప్పటికే 54 స్థానాల్లో విజయం సాధించిన అమ్ ఆద్మీ పార్టీ మరో 9 నియోజక వర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నిర్వహించిన అనేక సర్వేల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తోందని ముందే తెలిసింది. అయితే బెట్టింగ్ బజార్ లో సైతం ఆప్ తన హవా కొనసాగించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చితకలపడిందని స్పష్టం అయ్యింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: 2024లో మోదీ VS కేజ్రీవాల్?, అప్పుడే పోస్టర్లు, ఏం జరుగుతుందో ?!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: 2024లో మోదీ VS కేజ్రీవాల్?, అప్పుడే పోస్టర్లు, ఏం జరుగుతుందో ?!

ఢిల్లీలో ఓటర్ల హవా

ఢిల్లీలో ఓటర్ల హవా

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు చివరి వరకు బరిలో ఉన్నారు. సుమారు 1.4 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు తేల్చేశారు. 70 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2, 688 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తేడా !

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తేడా !

2015లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 70 స్థానాల్లో పోటీ చేసి 67 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయ్యింది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు ఆప్ విలవిలలాడింది. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుకుని ఆప్ కు గట్టి షాక్ ఇచ్చింది.

కాంగ్రెస్, ఆప్ కు సినిమా

కాంగ్రెస్, ఆప్ కు సినిమా

అమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో విడిపోయి పోటీ చెయ్యడంతో దానిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ విఫలయత్నం చేసింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారు అయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ ఢిల్లీలోని 70 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తన సత్తా చాటుకుంది.

బెట్టింగ్ బజార్ లో ఎవరికి ఎంతంటే ?

బెట్టింగ్ బజార్ లో ఎవరికి ఎంతంటే ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు -2020లో జరిగిన అనేక సర్వేల్లో ఆప్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తోందని వెలుగు చూసింది. అదే విధంగా బెట్టింగ్ బజార్ ( Satta Bazaar) లో సైతం ఆప్ దూసుకుపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54 నుంచి 56 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ 11 నుంచి 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచానాలు వేశారు. అయితే ఎన్నికల ఫలితాల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సినిమా చూశారు. బెట్టింగ్ బజార్ లో అమ్ ఆద్మీ పార్టీకి 70 పైసలు, బీజేపీకి 25 పైసలు, కాంగ్రెస్ కు 5 పైసలు బిడ్డింగ్ జరిగింది. అయితే బెట్టింగ్ బజార్ అంచనాలతో బీజేపీ నాయకుల ఆశలు తల్లకిందులు అయ్యాయి.

English summary
Delhi Assembly Election Exit Poll 2020: Satta bazaar also roots for a AAP comeback, gives 54-56 seats; BJP close behind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X